Horoscope Today: నేడు ఈ రాశి వారు వ్యాపారంలో రాణిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (18-12-2021): రోజు మొదలు పెట్టె ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు...

Horoscope Today: నేడు ఈ రాశి వారు వ్యాపారంలో రాణిస్తారు.. ఈరోజు రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Today Horoscope
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 18, 2021 | 6:41 AM

Horoscope Today (18-12-2021): రోజు మొదలు పెట్టె ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 18వ తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి:

ఈ రాశి వారు వారి రంగాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

వృషభ రాశి:

వీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో ఇబ్బందులు తొలుగుతాయి. శివారాధన శుభప్రదం. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి:

ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాలతో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన చేస్తే మంచిది.

కర్కాటక రాశి:

వీరు రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత కొంతవరకు మెరుగుపడుతుంది.

సింహ రాశి:

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ఆశాజనంక౦గా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కన్య రాశి:

ప్రారంభించిన పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ప్రయాణాలను వాయిదా వేయం డి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తుల

తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు.

వృశ్చిక రాశి:

స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

ధనుస్సు రాశి:

ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. నూతన వస్తువులు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మకర రాశి:

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. . వైద్య పరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి కానీ ఒపికతో ఉంటారు.

కుంభ రాశి:

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండే అవకాశం ఉంది.

మీన రాశి:

ఈ రాశి వారు పట్టుదల చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఎవరితోనూ విభేదించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో