కుక్కతో సెల్ఫీ ట్రై చేస్తున్నారా..! రంగు పడుద్ది జాగ్రత్త.. ఈ విషయం తెలిస్తే షాక్..

Selfie With Dog: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వింత కథనాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ పెంపుడు

కుక్కతో సెల్ఫీ ట్రై చేస్తున్నారా..! రంగు పడుద్ది జాగ్రత్త.. ఈ విషయం తెలిస్తే షాక్..
Selfie With Dog
Follow us

|

Updated on: Dec 17, 2021 | 11:42 AM

Selfie With Dog: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వింత కథనాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ద్వారా పెంపుడు కుక్కలతో ఎలా ఉండాలో చాలామందికి తెలిసివచ్చింది. కొంతమందికి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. వాటికి చాలా శిక్షణ ఇస్తారు. తద్వారా యజమాని చెప్పిన విధంగా కుక్క చేస్తుంది. అయితే కొన్నిసార్లు మితిమీరిన ప్రేమ వల్ల ప్రమాదాలకు గురికావల్సి వస్తుంది. ఓ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో మొదట ఆమె తన పెంపుడు కుక్కతో హాయిగా ఫోటో దిగుతూ కనిపిస్తుంది. తర్వాత వెంటనే ఆ కుక్క అమ్మాయిపై దాడి చేస్తుంది. ఆ తర్వాత బాలిక ముఖం మొత్తం కుట్లతో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాలిక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు పెంపుడు జంతువుల నుంచి సరైన దూరం పాటించాలని సూచిస్తున్నారు. మొదటి చిత్రంలో 17 ఏళ్ల లారా సన్స్ నవ్వుతున్న జర్మన్ షెపర్డ్‌తో ఫొటో దిగుతుంది. అప్పుడు కుక్క చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ కొన్ని సెకన్లలో కుక్క తన యజమానురాలిపై దాడి చేస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం.

చాలా ఫొటోలు తీస్తుండగా ఒక్కసారి కుక్కకు ఓపిక నశించి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో లారా సన్స్ పై దాడి చేసింది. ఈ జర్మన్ షెపర్డ్ లారా ముఖాన్ని కరిచేసింది. ఎంతలా అంటే పళ్లు మొత్తం ఆమె ముఖంలో దించేసింది. తన ప్రియమైన కుక్క తనపై అలా దాడి చేస్తుందని ఆ అమ్మాయికి ఊహించలేదు. వెంటనే ఆమె నొప్పితో అరవడం ప్రారంభించింది. దగ్గరలో ఉన్న ఆమె స్నేహితుడు వచ్చి కుక్కను తరిమికొట్టాడు.

జర్మన్ షెపర్డ్ చేసిన ఈ దాడిలో లారా తీవ్రంగా గాయపడింది. ఆమె నుదిటి పైన, ఆమె పెదవి దగ్గర లోతైన గాయాలను చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ముఖానికి చాలా కుట్లు వేశారు. దీంతో లారా ముఖం అంద విహీనంగా తయారైంది. ప్రజలు ఇప్పుడు ఈ పోస్ట్‌ను హెచ్చరికగా షేర్ చేస్తున్నారు. ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా జంతువులకు మాత్రం దూరంగా ఉండాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

HDFC Life: రిటైర్మెంట్ ప్లాన్‌ని ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. పాలసీదారులకు అనేక ప్రయోజనాలు..

పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..! కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు