Omicron Variant: 111కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ..

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు మరింత వేగం విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 111 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని..

Omicron Variant: 111కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ..
Cases Detected
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 17, 2021 | 7:48 PM

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు మరింత వేగం విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 111 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారి నుంచి ఈ వేరియంట్‌ మన దేశంలోకి వచ్చేసింది. ఈ నెల మొదటి వారంతో మన దేశంలోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. బయటి వచ్చిన వారికి నిర్ధారణ పరీక్షల ద్వారా సేకరించిన నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపిన తర్వాత 3 రోజులకు కానీ ఫలితాలు రావడం లేదు.. ఈలోగా వారి నుంచి మరి కొందరికి ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

ఇవి కూడా చదవండి: Bandi Sanjay: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

Chandrababu: అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి.. వారి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు ఆందోళన