India Covid: నేడు దేశవ్యాప్తంగా 8వేల దిగువకు కరోనా కేసులు..పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి పై ఆందోళన

India Covid: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరసగా రెండో రోజు 8వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 7447..

India Covid: నేడు దేశవ్యాప్తంగా 8వేల దిగువకు కరోనా కేసులు..పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి పై ఆందోళన
India Corona
Follow us

|

Updated on: Dec 17, 2021 | 11:09 AM

India Covid: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరసగా రెండో రోజు 8వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 7447 మంది కరోనా వైరస్ బారినపడినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,47,26,049లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్ వలన 4,76,869 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో మొత్తం 12,16,011 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. కొవిడ్ కారణంగా. 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్‌గా ఉండగా గురువారం రాత్రి వరకు దేశ వ్యాప్తంగా 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టగా.. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత అధికమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ్​ బెంగాల్​లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.

Also Read:  హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే..

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..