AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాలంలో ప్రజలు ఇళ్లు, కార్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు..! కారణం ఏంటో తెలుసా..?

Corona Pandemic: కరోనా మహమ్మారి మందగమనం మధ్య ప్రజలు చాలా ఇళ్ళు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిసారి దీపావళి తర్వాత బ్యాంకుల్లో

కరోనా కాలంలో ప్రజలు ఇళ్లు, కార్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు..! కారణం ఏంటో తెలుసా..?
Houses And Cars
uppula Raju
|

Updated on: Dec 18, 2021 | 8:54 AM

Share

Corona Pandemic: కరోనా మహమ్మారి మందగమనం మధ్య ప్రజలు చాలా ఇళ్ళు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిసారి దీపావళి తర్వాత బ్యాంకుల్లో ఇల్లు, కారు కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ఈసారి అలా జరగలేదు. బ్యాంకుల వడ్డీ రేట్లు దశాబ్ద కాలంలో కనిష్ట స్థాయిలో ఉన్నాయి. దీంతో వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం నుంచి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న భయం కూడా జనాల్లో ఉంది. కాబట్టి ప్రజలు తక్కువ ధరకే రుణాలు పొందుతున్నారు. పండుగ సీజన్ ముగిసినా రిటైల్ లోన్ డిమాండ్ ఎక్కువగానే ఉందని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు చెబుతున్నాయి. ఇల్లు, కారు, మరిన్ని స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీ రేటును కస్టమర్లు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు.

వినియోగదారుల రుణ దరఖాస్తుల పెరుగుదల RBI ప్రకారం.. అక్టోబర్ 22 వరకు బకాయి ఉన్న రిటైల్ రుణం రూ. 29.55 లక్షల కోట్లు. ఇది ఏడాది క్రితం కంటే 11.7 శాతం ఎక్కువ. బ్యాంకులు కస్టమర్ల కోసం రుణ దరఖాస్తులలో స్థిరమైన వృద్ధిని చూస్తున్నాయి. ఈ ట్రెండ్ అన్ని రిటైల్ విభాగాలలో కొనసాగుతుందని ఆశిస్తున్నాయి. కార్పొరేట్ రుణ డిమాండ్‌ పుంజుకోని కారణంగా బ్యాంకులు ప్రస్తుతం తమ వృద్ధిని కొనసాగించేందుకు పూర్తిగా రిటైల్ రుణాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకే పండుగల తర్వాత కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.

రిటైల్ రుణ డిమాండ్ పుంజుకునే అవకాశం ప్రస్తుతం రిటైల్ రుణ డిమాండ్‌లో ఎలాంటి లోటు లేదని అయితే వడ్డీ రేట్లు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నందున ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం కారణంగా దాదాపు అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. పండుగలకు ముందే మార్కెట్ పూర్తిగా నిలిచిపోయింది. చాలా మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో సొంత వ్యాపారం ఉన్న వారిపై భారం పెరిగింది. కానీ పండుగల సమయంలో పరిస్థితి చాలా మెరుగుపడింది. కొత్త సంవత్సరంతో అనేక మార్పులు కూడా రానున్నాయి. ఈలోగా బ్యాంకులు కూడా పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రజలకు అందిస్తున్నాయి.

E-shram కార్డ్‌తో ప్రయోజనాలేంటి..? ఇది ఎలా పొందాలి.. దీనికి ఎవరు అర్హులు తెలుసుకోండి..

Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..

చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ తినండి.. కానీ మితిమీరితే శరీరానికి హాని.. ఎలాగో తెలుసా..?