suvendu adhikari fire on mamata banerjee ..ప్రధానితో మీటింగ్ ని ఆమె ‘హైజాక్ ‘చేశారు, ‘బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువెందు అధికారి మండిపాటు
ప్రధాని మోదీతో సమావేశాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 'హైజాక్' చేశారని బీజేపీ నేత సువెందు అధికారి ఆరోపించారు. ఇదివరకు ముఖ్యమంత్రులతో ప్రధాని పాల్గొన్న సమావేశాలకు గైర్ హాజరైన ఆమె.. తాజా మీటింగ్ ని 'రాజకీయం' చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు....
ప్రధాని మోదీతో సమావేశాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘హైజాక్’ చేశారని బీజేపీ నేత సువెందు అధికారి ఆరోపించారు. ఇదివరకు ముఖ్యమంత్రులతో ప్రధాని పాల్గొన్న సమావేశాలకు గైర్ హాజరైన ఆమె.. తాజా మీటింగ్ ని ‘రాజకీయం’ చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. గత కొన్ని నెలలుగా మోదీ సీఎంలతో సమావేశమవుతున్నారని, వీటిలో ఎన్నింటికి ఆమె హాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. ‘జీరో’ అని వ్యాఖ్యానించారు. తాజా మీటింగ్ లో ప్రధాని తనను మాట్లాడనివ్వలేదని, తాను అవమానానికి గురయ్యానని మమత తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం గమనార్హం. కొందరు బీజేపీ ముఖ్యమంత్రులతో మాత్రమే మోదీ మాట్లాడారని, ఇది చాలా క్యాజువల్ మీటింగ్ అని ఆమె అభివర్ణించారు. అయితే ఈమె దీనికి పొలిటికల్ కలర్ అద్దుతున్నారని సువెందు అధికారి ట్వీట్ చేశారు. ఇది షేమ్ ఫుల్ అని మండిపడ్డారు. ప్రధాని కో-ఆపరేటివ్ ఫెడరలిజం అనుసరిస్తుంటే మమతా బెనర్జీ సంఘర్షణాత్మక ఫెడరలిజం అనుసరిస్తున్నారు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోవిద్ పరిస్థితి దారుణంగా ఉండగా ఇప్పటికీ అధికార పార్టీ నేతలు , కార్యకర్తలు ‘విక్టరీ డ్యాన్సుల్లో’ బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు బెంగాల్లోని ఈ పరిస్థితి పట్ల ఈ ప్రభుత్వం యేమాత్రమైనా శ్రద్ధ చూపుతోందా అని సువెందు అధికారి ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, దీనిపై ప్రధాని మోదీ నిర్వహించే సమావేశాలకు మమత హాజరై.. తన ప్రభుత్వం దీని అదుపునకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి మీటింగును రాజకీయం చేయడానికి ప్రయత్నించరాదన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో ) మధ్యదరా సముద్రంలో ఘోరం….!! పడవ మునిగి 57 మంది మృతి… ( వీడియో )