కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం, ‘నవ కేరళం’ ఆవిర్భావానికి కృషి చేస్తానని ట్వీట్ ,
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు., రాష్ట్ర సీఎంగా ఆయన ప్రమాణం చేయడం ఇది రెండో సారి. కోవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు....
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు., రాష్ట్ర సీఎంగా ఆయన ప్రమాణం చేయడం ఇది రెండో సారి. కోవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ హైకోర్టు అనుమతితో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో కోవిద్ పరిస్థితి దారుణంగా ఉందని, అందువల్ల వర్చ్యువల్ గా ఇది జరిగేట్టు చూడాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని కోర్టు సూచించింది. ప్రమాణ స్వీకారం అనంతరం విజయన్ ….నవ కేరళం ఆవిర్భావానికి కృషి చేస్తానని ట్వీట్ చేశారు. ప్రజల అభిమతం ప్రకారం వారి ఆశయాల మేరకు పని చేస్తానని పేర్కొన్నారు. 20 మంది సభ్యులతో కూడిన కేబినెట్ లో ముగ్గురు మహిళలు ఉన్నారు. డా.ఆర్.బిందు, చించు రాణి, వీణా జార్జ్ మంత్రులయ్యారు. తన అల్లుడు పి.ఎ. మహమ్మద్ రియాజ్ ని విజయన్ మంత్రిని చేశారు. కొత్త కేబినెట్ లో 75 శాతం మంది మొదటిసారి మినిస్టర్స్ కాగా 10 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలయ్యారు.విజయన్ తో బాటు ఎన్ సీ పీ కేరళకు చెందిన శశీంధ్రన్, ఇండియన్ నేషనల్ లీగ్ కి చెందిన అహమద్ దేవర్ విల్ , ఇంకా బిందు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని తాము బాయ్ కాట్ చేస్తామని విపక్షం మొదట చెప్పినప్పటికీ.. ఆ తరువాత వర్చ్యువల్ గా హాజరవుతామని స్పష్టం చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో ) మధ్యదరా సముద్రంలో ఘోరం….!! పడవ మునిగి 57 మంది మృతి… ( వీడియో )