బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస..కేంద్రానికి, మమత ప్రభుత్వానికి, ఈసీకి సైతం సుప్రీంకోర్టు నోటీసులు
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస తాలూకు ఘటనల అంశం చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. దీనిపై తాజాగా ఓ పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీంకోర్టు కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి సైతం నోటీసులు జారీ చేసింది. వీటికి నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస తాలూకు ఘటనల అంశం చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. దీనిపై తాజాగా ఓ పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీంకోర్టు కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి సైతం నోటీసులు జారీ చేసింది. వీటికి నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన అనంతరం రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం చేత దర్యాప్తు జరిపించాలని ఓ పిటిషనర్ కోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ లో కోరారు. బీజేపీకి మద్దతు నిచ్చినందుకు ప్రతీకారంగా ఓ వర్గం వారు మరో వర్గం వారి ఇళ్లపై దాడులు చేశారని లూటీలకు పాల్పడ్డారని ఆ పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ ప్రకటించినందుకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలాంటి చర్యలు దిగారని అన్నారు. సామాన్య ప్రజలు పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావన్నారు. బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై ఇప్పటికే కలకత్తా హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా అన్న అంశానికి సంబంధించి అన్ని కేసులను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ని కోర్టు ఆదేశించింది.
అయితే ఈ కమిటీ సభ్యులు నిన్న బెంగాల్ లోని జాదవ్ పూర్ ని విజిట్ చేయగా వారిపైనా కొందరు దాడి చేశారు. అంతకు ముందు ఇక్కడ జరిగిన హింసాకాండలో 40 కి పైగా ఇళ్లపై దాడులు జరిగాయని స్థానికులు తెలిపినట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక ఈ హింసాత్మక ఘటనల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది గనుక కేంద్రం, ఈసీ, బెంగాల్ ప్రభుత్వం కూడా దీనిపై తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ చిన్నోడు ఓ టాప్ హీరో కొడుకు తెలుసా..?తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న స్మాల్ హీరో..:Star Hero Son video.
గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.