Woman Doctor: దారుణం.. ఫుడ్‌ డెలివరీ ఇచ్చేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం..

ఒడిశాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. మహిళా వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫుడ్ డెలివరీ

Woman Doctor: దారుణం.. ఫుడ్‌ డెలివరీ ఇచ్చేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం..
woman Raped
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 01, 2021 | 7:31 PM

ఒడిశాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. మహిళా వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న వైద్యురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన.. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో జరిగింది. అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్‌ పార్శిల్‌ పంపాడు. అనంతరం ఆ ఫుడ్ పార్శిల్‌ను తీసుకొని దాబా యజమాని కుమారుడు.. మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు.

ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై దాబా యజమాని కుమారుడు బెహరా అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. సోదరుడు ఇంటికి రాగానే.. మహిళా వైద్యురాలు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అంగూల్ జిల్లా పోలీసులు తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.

Also Read:

Man Ties Wife: అతడు శాడిస్ట్‌లకే శాడిస్ట్‌.. భార్యను 30 కిలోల గొలుసుతో బంధించాడు.. మూడు నెలలుగా నరకయాతన..!

Tv9 Telugu Number 1 website: తగ్గేదే లే.. డిజిటల్ మీడియా రంగంలోనూ టీవీ9 తెలుగు సెన్సేషన్.. నంబర్ 1 స్థానంలో వెబ్‌సైట్