Man Ties Wife: అతడు శాడిస్ట్‌లకే శాడిస్ట్.. భార్యను 30 కిలోల గొలుసుతో బంధించాడు.. మూడు నెలలుగా నరకయాతన..!
తాళి కట్టిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రాకుండా 30 కిలోల గొలుసుతో బంధించాడు. మూడు నెలలుగా ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు.
Rajasthan Man ties Wife with Iron Chains: అతడు శాడిస్ట్‌లకు శాడిస్ట్. మనిషి అన్న పదానికే వికృతరూపం.. తాళి కట్టిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రాకుండా 30 కిలోల గొలుసుతో బంధించాడు. మూడు నెలలుగా ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న అతడి వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
భార్యపై విపరీతమైన అనుమానం.. ఆ అనుమానమే పెనుభూతంగా మారింది. శాడిస్ట్ భర్త ఆమెను పలువిధాలుగా హింసించాడు. ఆఖరికి 30 కేజీల గొలుసుతో ఆమెను బంధించారు. ఆ మహిళ ఎక్కడికి వెళ్లినా 30 కేజీల గొలుసు మోయాల్సిందే. సంచలనం రేపిన ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో జరిగింది. బేరూలాల్ అనే వ్యక్తి తన భార్యను 30 కేజీల గొలుసుతో బంధించాడు. ఆమెకు ఎవరితోనే వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం బేరూలాల్‌కు కలిగింది. ఆ అనుమానంతో భార్య నేరం చేయకుండానే శిక్ష అనుభవించింది.
భూరేలాల్ ఎక్కడికి వెళ్లినా తోడుగా భార్య ఉండాల్సిందే. గొలుసుతో సహా ఆమె తన వెంట వెళ్తుంది. అయితే, ఈ విషయంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో గుడి సమీపంలో బాధితురాలు కూర్చొని ఉంది. గొలుసు బంధం నుంచి పోలీసులు ఆమెకు విముక్తి కల్పించారు. బేరూలాల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.బేరూలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తన భర్త చాలా సార్లు కొట్టాడని బాధితురాలు ఆరోపించారు. అనుమానంతో శారీరకంగా, మానసికగా చిత్రవధకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడునెలల నుంచి నరకయాతన అనుభవిస్తునట్టు బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. బేరూలాల్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also…. Drugs: భాగ్యనగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం.. విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..