ఉలుబేడియా సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ.. ప్రముఖ నటి పాపియా అధికారికి టికెట్ ఇచ్చింది. టీఎంసీ.. రెండుసార్లు గెలిచిన పులక్ రాయ్ ను తన అభ్యర్థిగా ప్రకటించింది. రాయ్ 2011 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. బెంగాలీ ప్రసిద్ధ నటి పాపియా అధికారి ఇటీవల బీజేపీలో చేరారు. హౌరా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి ఉలుబేడియా వస్తుంది. తృణమూల్‌కు చెందిన సజ్దా అహ్మద్ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. బీజేపీకి చెందిన జాయ్ ఘోష్‌ను ఓడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి పులక్ రాయ్ సుమారు 96 వేల ఓట్లు సాధించారు.