चुनाव क्षेत्र चुनें

లాకెట్ ఛటర్జీ-చుంచురా అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

బీజేపీ | చుంచురా

ప్రసిద్ధ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆమెను చుంచుడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబెట్టింది. 2015లో టీఎంసీని వీడి బిజెపిలో చేరిన లాకెట్ ఛటర్జీ.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఎంపీగానే కాకుండా లాకెట్‌ ఛటర్జీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. అయితే 2016లో బీజేపీ లాకెట్ ఛటర్జీని మయూరేశ్వర్ సీటు నుంచి బరిలో దింపినప్పటికీ.. ఆమె టీఎంసీ అభ్యర్థి అభిజీత్ రాయ్ చేతిలో ఓటమిపాలైంది. దీని తరువాత ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఆమెకు హుగ్లీ సీటును కేటాయించగా.. టిఎంసీకి చెందిన రత్న దే ను ఓడించి లాకేట్‌ ఛటర్జీ గెలుపొందారు.

Ads By Adgebra