चुनाव क्षेत्र चुनें

శోభనదేవ్ చటోపాధ్యాయ-భవానీపూర్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

టీఎంసీ | భవానీపూర్‌

శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు. టీఎంసీ ఏర్పడిన తరువాత చటోపాధ్యాయ 1998లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మమతా బెనర్జీ మొదటి ప్రభుత్వంలో శోభన్ దేవ్ చటోపాధ్యాయ్ చీఫ్ విప్ గా పనిచేశారు. టీఎంసీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు విద్యుత్ మంత్రిత్వ శాఖ బాధ్యతను అప్పగించారు. షోభన్‌దేవ్‌ చటోపాధ్యాయ టీఎంసీ ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా.. టీఎంసీలో చేరే ముందు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. 1991, 1996లో బారుపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ ప్రకటించిన తర్వాత చటోపాధ్యాయ ఆమెతో చేరారు. ప్రస్తుతం రాస్‌బీహారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. 2001 నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. అయితే.. ఈసారి మమతా బెనర్జీ తన సాంప్రదాయ సీటును వదిలి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు.. కావున చటోపాధ్యాయను రాస్‌బిహారీ నుంచి కాకుండా భవానీపూర్ నుంచి పార్టీ రంగంలోకి దింపింది. ఇక్కడ ఆయన బిజెపికి చెందిన రుద్రానిల్ ఘోష్‌ను ఎదుర్కొనున్నారు. ఘోష్ ఇటీవల టీఎంసీ నుంచి బిజెపిలో చేరారు.

Ads By Adgebra