Bengal Violence: బెంగాల్ హింసాకాండ.. సీఎస్‌కు సమన్లు పంపిన గవర్నర్.. వివరణ ఇవ్వాలంటూ..
West Bengal Post-Poll Violence: పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండ నేపథ్యంలో శాంతి భద్రతల
West Bengal Post-Poll Violence: పశ్చిమ బెంగాల్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండ నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని తనకు సమగ్రంగా నివేదించాలని గవర్నర్ జగ్దీప్ దన్‌కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈమేరకు జగ్‌దీప్ ధన్కర్ శనివారం సమన్లు జారీ చేశారు. ఎన్నికల అనంతరం అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు అదనపు ముఖ్య కార్యదర్శి హెచ్ ఎస్ ద్వివేది తనకు ఎలాంటి సమాచారం అందించలేదని పేర్కొన్నారు. ఈ నివేదికలను డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మే 3న తనకు పంపిన నివేదికలను తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల అనంతర హింసపై తనకు సమగ్రంగా వివరించేందుకు శనివారం సాయంత్రం ఏడు గంటలలోగా తనను కలిాోతీ గవర్నర్ జగ్దీప్ దంకర్ ట్వీట్ చేశారు. అదనపు ముఖ్యకార్యదర్శి ద్వివేది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారని ఆరోపించారు. డీజీపీ, పోలీస్ కమిషనర్ల నివేదికలను తనకు సమర్పించకపోవడం పట్ల సీఎస్ తీరును గవర్నర్ తప్పుపట్టారు. ఎన్నికల అనంతర హింసపై రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నెలకొంది. తృణముల్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అయితే హింసపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు.
Also Read: