AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remedesvir: గుజరాత్ కేంద్రంగా నకిలీ రెమిడెస్విర్ ఇంజక్షన్లు.. ఇండోర్ లో తీగ లాగితే కదిలిన సూరత్ డొంక..దేశవ్యాప్త దందా!

Remedesvir Duplicator:

Remedesvir: గుజరాత్ కేంద్రంగా నకిలీ రెమిడెస్విర్ ఇంజక్షన్లు.. ఇండోర్ లో తీగ లాగితే కదిలిన సూరత్ డొంక..దేశవ్యాప్త దందా!
Remidesvir Duplicator
KVD Varma
| Edited By: Janardhan Veluru|

Updated on: May 11, 2021 | 11:36 AM

Share

Remedesvir: గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ రెమిడెస్విర్ తయారీకి పెద్ద కర్మాగారం నిర్వహిస్తున్నారు. ఇండోర్, సూరత్ పోలీసుల చర్యలతో ఈ విషయం వెల్లడైంది. నకిలీ ఇంజెక్షన్లు చేస్తున్న ఫాంహౌస్‌పై సూరత్ పోలీసులు దాడి చేశారు. ముఠా ప్రధాన నాయకుడు కోషల్ వోహ్రాను అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి ఇండోర్ కు చెందిన నిందితుడు సునీల్ మిశ్రా ఇంజెక్షన్లు తీసుకునేవాడు. అతను మధ్యప్రదేశ్‌లో 12 వందల ఇంజెక్షన్లను సరఫరా చేశాడు. ఇండోర్‌లో వెయ్యి ఇంజక్షన్లు, జబల్‌పూర్‌లో రెండు వేల ఇంజక్షన్లను ఈ ముఠా విక్రయించింది. దేశవ్యాప్తంగా 5 వేల నకిలీ రెమిడెస్విర్లను విక్రయించింది. ఎవరికి, ఏ మొత్తంలో ఇంజెక్షన్లను అమ్మారనే విషయంపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

ఇండోర్ పోలీసులు..అక్కడి విజయ్ నగర్ ప్రాంతం లో ఒకే బృందంలోని ఇద్దరు సభ్యులను గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇందులో రేవా నివాసి సునీల్ మిశ్రా పేరు బయటపడింది. దీని తరువాత, ఒక బృందం సూరత్ చేరుకుంది. అతన్ని అక్కడి సూరత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని తరువాత, మొత్తం ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఫామ్‌హౌస్ నుంచి ఇంజెక్షన్ 1700 రూపాయలకు అమ్మేవారు. వాటిని పెద్ద చైన్ వ్యవస్థ ఉన్న బ్రోకర్లు 35 నుండి 40 వేల రూపాయలకు అమ్ముతున్నారు.

ట్రాప్ చేసి.. మాటు వేసి..

మూడురోజుల క్రితం ఒక మహిళ ఫిర్యాదుతో ఈ విషయం విజయనగర్ పోలీసులకు తెలిసింది. ఒక వ్యక్తి తనకు నకిలీ Remedesvir ఇంజక్షన్ ఇచ్చారని ఆ మహిళ చెప్పింది. అయితే, మహిళలకు మాత్రమే ఆ వ్యక్తి ఇంజక్షన్ అమ్ముతున్నాడని చెప్పారు. దీంతో పోలీసులు వలపన్నారు. ఎస్ఐ ప్రియాంకను ఇంజక్షన్ కోసం..విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి తెహ్జీబ్ ఖాజీ పంపించాడు. నిందితుడు సురేష్ యాదవ్ ఇంజక్షన్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సమయంలో ఉచ్చు వేసి అతనిని పట్టుకున్నారు. సురేష్ యాదవ్ ను విచారణ చేస్తే ధీరజ్, దినేష్ పట్టు పడ్డారని ఎస్పీ అశుతోష్ బాగ్రి చెప్పారు. వారి వద్ద అకా సిద్ధార్థ్ అనే యువకుని పేరు బయటకు వచ్చింది. అప్పుడు వీరందరినీ కలిపి గట్టిగా విహారిస్తే.. అసీమ్ భలే తో పాటుగా సునీల్ మిశ్రా అనే పేరు వెలువడింది. సునీల్ మిశ్రా ఈ రాకెట్ లో కీలక సూత్రధారిగా నిర్ధారించుకున్న పోలీసులు అతని కాల్ వివరాలు సేకరించారు. దీంతో గుజరాత్ లోని సూరత్ లొకేషన్ దొరికింది. విజయ్ నగర్ పోలీసులు వెంటనే సూరత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూరత్ పోలీసులు వెంటనే నిందితుడు సునీల్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఫ్యాక్టరీపై దాడి చేశారు, అక్కడ నకిలీ స్టిక్కర్లు, వేలాది నకిలీ ఇంజెక్షన్ బాటిళ్ళు దొరికాయి. దానిలో చాలా వరకు గ్లూకోజ్, నీటితో లోడ్ చేయబడ్డాయి. ఇక్కడి నుంచి ఎక్కువ మంది ముఠా సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఇండోర్ పోలీసులకు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాకెట్..

ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వారి పేర్లను పూర్తిగా పోలీసులు వెల్లడించలేదు. వీరంతా బీహార్, మహారాష్ట్రకు చెందినవారని మాత్రం చెప్పారు. వీరి చైన్ గుజరాత్ లోని ఇతర నగరాలలో కూడా విస్తరించి ఉందని చెబుతున్నారు. ప్రతి చోటా దాడులు జరుగుతున్నాయని వివరించారు.

నిందితులు విచారణలో మాట్లాడుతూ ఇప్పటివరకు 15 లక్షల Remedesvir ఇంజక్షన్లు పంపించామని చెప్పారు. నిరంతర ఇంజెక్షన్ల డిమాండ్ పెరిగిన తరువాత దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. నిందితులు చాలాకాలం గుజరాత్ నుండి ఇండోర్ వరకు రోడ్డు ద్వారా ఇంజెక్షన్లు తీసుకువచ్చేవారు. వీరు వచ్చే వాహనం పై ఎమెర్జెన్సీ సేవ అని రాసి ఉండడంతో సరిహద్దుల్లో వాహనం ఎవరూ ఆపేవారు కాదు.

Also Read: విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..

AP Crime News: భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి