విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..

Heroin seized: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్‌ పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్‌, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు...

విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..
Heroin seized
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2021 | 10:16 AM

Heroin seized: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్‌ పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్‌, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు 15 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియాకు చెందిన ఓ వ్యక్తిని, మహిళను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

ఆఫ్రికా నుంచి భారత్‌కు ..

కాగా, ఆఫ్రికా నుంచి భారత్‌కు డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని కస్టమ్స్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియాకు చెందిన 43 ఏళ్ల మహిళను, 45 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

బయటకు వాసన రాకుండా ప్యాకింగ్‌..

కాగా, హెరాయిన్‌ను పాలిథిన్‌ సంచుల్లో కట్టి వాసన బయటకు రాకుండా అందులో మసాల పొడిని చల్లినట్లు అధికారులు తెలిపారు. అయితే తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్‌ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణ విచారణ బయటపడింది. బెంగళూర్‌కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

Road Accident: హైదరాబాద్‌ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు దుర్మరణం

Murder: రూ.3 వేలు అడిగినందుకు భార్యను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన కసాయి భర్త.. కేసు నమోదు