Road Accident: హైదరాబాద్‌ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు దుర్మరణం

Hyderabad Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌..

Road Accident: హైదరాబాద్‌ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు దుర్మరణం
Road Accident

Hyderabad Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుల్తాన్‌ బజార్‌ సీఐ ఎస్‌. లక్ష్మణ్‌, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే వీరు సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సీఐ భార్య ఝాన్సీ కారును నడిపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధింమి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి

AP Crime News: భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి

Chota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ బతికే ఉన్నాడు.. ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా