AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!

Income Tax Notice: గత కొన్ని రోజులుగా అదాయపు పన్ను శాఖ, బ్యాంకు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు వారి నిబంధనలు కఠినతరం చేయడం..

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!
Income Tax
Subhash Goud
|

Updated on: May 08, 2021 | 9:17 AM

Share

Income Tax Notice: గత కొన్ని రోజులుగా అదాయపు పన్ను శాఖ, బ్యాంకు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు వారి నిబంధనలు కఠినతరం చేయడం ద్వారా నగదు లావాదేవీలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. ఇవి నగదు లావాదేవీని ఒక నిర్థిష్ట పరిమితికి అనుమతి ఇస్తాయి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను వారికి నోటీసులు పంపే అవకాశం ఉంది. అయితే అధిక విలువైన నగదు లావాదేవీలు జరిపే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండాలి. ఎందుకంటే ఆదాయపు పన్ను దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిమితికి మించి చేసే లావాదేవీల వివరాలు సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. ఒక వ్యక్తి స్టాక్‌ మార్కెట్లో నగదును ఉపయోగించి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా పెట్టుబడి పెడితే బ్రోకర్‌ తన బ్యాలెన్స్‌ షీట్‌లో పెట్టుబడి గురించి నివేదిస్తాడు. అక్కడ లావాదేవీ విషయం బయటపడిపోతుంది. అందుకే నగదు లావాదేవీల పరిమితిని తెలుసుకుని వ్యవహరిస్తే ఎలాంటి నోటీసులు రాకుండా జాగ్రత్త పడవచ్చ అంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఆదాయపు పన్ను నోటీసులు జారీ చేసే ఈ ఐదు లావాదేవీలు ఇవే..

సేవింగ్‌, కరెంటు ఖాతా:

ఒక వ్యక్తికి, సేవింగ్‌ ఖాతాలో నగదు డిపాజిట్‌ పరిమితి రూ.1 లక్ష. పొదుపు ఖాతాలో ఒక లక్ష రూపాయలకు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంది. అదే విధంగా కరెంటు ఖాతా ఉన్నవారు రూ.50 లక్షలు. ఈ పరిమితిని మించినట్లయితే నోటీసులు పంపే అవకాశం ఉంది. నోటీసులు వచ్చినట్లయితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు:

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించే సమయంలో రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. అందుకు సమాధానం చెప్పాలి.

బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌:

బ్యాంకు ఎఫ్‌డీలో నగదు డిపాజిట్‌ రూ.10 లక్షలకు మించకూడదు. బ్యాంకు డిపాజిట్‌ ఒకరి బ్యాంకు అకౌంట్లో అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయకూడదు. అలా చేసినట్లయితే నోటీసులు జారీ అయ్యే అవకాశాలుంటాయి.

మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్‌:

మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌, బాండ్‌ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు నగదు పెట్టుబడులు రూ.10 లక్షలకు మించకూడదు. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను శాఖ మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్‌ను తనిఖీ చేస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌:

ఒక ఆస్తిని కొనుగోలు చేసే సమయంలో లేదా విక్రయించే సమయంలో, రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందంలో రూ.30 లక్షల పరిమితిని మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఇలా బ్యాంకు లావాదేవీల విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఉన్న నిబంధనలు ఇప్పుడు లేవు. గతంలో కంటే ఇప్పుడు నిబంధనల్లో ఎన్నో మార్పులు జరిగాయి. నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించి లావాదేవీలు జరిపినా.. తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి

SBI Customer: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. కరోనా సమయంలో కొత్త సర్వీసులను అందుబాటులోకి..!

New Car: కొత్త కారు కొనాలని భావిస్తున్నారా..? అయితే ఈ రోజే కొనండి.. రేపటి నుంచి ఈ కార్ల ధరలు పెరగనున్నాయి..!