Petrol Diesel Price Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజాగా పెరిగిన ధరలు
Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా శనివారం..
Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా శనివారం ఐదో రోజు పెరిగాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. అయితే తాజాగా పెట్రోల్ 27 పైసల వరకు పెరుగగా, డీజిల్ 30పైసల వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.86 ఉండగా, డీజిల్ ధర రూ.89.11 ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.41 ఉండగా, డీజిల్ ధర రూ.88.68 ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.02 ఉండగా, డీజిల్ ధర రూ.89.24 ఉంది. ఖమ్మంలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.92 ఉండగా, డీజిల్ ధర రూ.89.14 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు
ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.35 ఉండగా, డీజిల్ ధర రూ.91.05 ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.18 ఉండగా, డీజిల్ ధర రూ.89.91 ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.49 ఉండగా. డీజిల్ ధర రూ.91.13 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.27 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.81.73 ఉంది. అలాగే కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.41 ఉండగా, డీజిల్ ధర రూ.84.57 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.61 ఉండగా, డీజిల్ ధర రూ.88.82 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.15 ఉండగా, డీజిల్ ధర రూ.86.65 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.94.30 ఉండగా. డీజిల్ ధర రూ.86.64 వద్ద ఉంది.