Murder: రూ.3 వేలు అడిగినందుకు భార్యను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన కసాయి భర్త.. కేసు నమోదు

Murder: ఓ కసాయి తన భార్యను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కృష్ణా జిల్లా పాయకాపురం ఎల్‌బీఎస్‌ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.

Murder: రూ.3 వేలు అడిగినందుకు భార్యను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన కసాయి భర్త.. కేసు నమోదు
murder
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2021 | 11:50 AM

Murder: ఓ కసాయి భర్త తన భార్యను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కృష్ణా జిల్లా పాయకాపురం ఎల్‌బీఎస్‌ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డాది దుర్గారావు, నీరజ (20) దంపతులకు నాలుగు నెలల కిందట వివాహమైంది. అయితే నీరజ మొదటి భర్త మృతి చెందగా, దుర్గారావు మొదటి భార్యకు విడాకులు తీసుకోవడంతో వీరిద్దరికి పెద్దల సమక్షంలో రెండో వివాహం జరిగింది. దుర్గారావు బీసెంట్‌రోడ్డులోని ఓ దుకాణంలో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. వివాహం అయిన తర్వాత రెండు నెలల వరకు దంపతులు బాగానే ఉన్నారు. తర్వాత వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. దీంతో నీరజ భర్త నుంచి దూరంగా వాంబేకాలనీలో నివాసం ఉంటోంది. గతంలో కలిసి ఉన్న సమయంలో దుర్గారావు రూ.3 వేల రూపాయలు నీరజకు ఇవ్వాల్సి ఉండగా, ఆ నగదు తరచూ ఆమె అడుగుతుండేది. అతను ఇవ్వకపోవడంతో నిలదీసేందుకు బుధవారం సాయంత్రం ఎల్‌బీఎస్‌నగర్‌లో దుర్గారావు ఇంటికి వచ్చింది.

తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, రూ.3 వేలు ఇవ్వాలని కోరింది. ఈ విషయం ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో విచక్షణ కోల్పోయిన దుర్గారావు ఇంట్లో ఉన్న చాకుతో బలంగా పొట్ట భాగంలో పొడవడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నామమని పోలీసులు తెలిపారు. నీరజ సోదరుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Oxygen Cylinder Exploded: లక్నోలో ఘోర ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

గుజరాత్‌లో కరోనా రూల్స్ బేఖాతరు.. కోవిడ్‌ రక్కసి అంతానికి నీళ్ల బిందెలతో జలాభిషేకం.. తీరా ఏం జరిగిందంటే..!