గుజరాత్‌లో కరోనా రూల్స్ బేఖాతరు.. కోవిడ్ రక్కసి అంతానికి నీళ్ల బిందెలతో జలాభిషేకం.. తీరా ఏం జరిగిందంటే..!
కరోనాతో పాటు మూఢభక్తి కూడా విజృంభిస్తోంది. కోవిడ్ రక్కసిని అంతం చేయాలంటూ కరోనా రూల్స్ బేఖాతరు చేశారు జనం. ఆలయంలో జలాభిషేకం చేసేందుకు వందలాదిగా తరలివచ్చారు.
Women Flock Religious Procession: కరోనాతో పాటు మూఢభక్తి కూడా విజృంభిస్తోంది. కోవిడ్ రక్కసిని అంతం చేయాలంటూ కరోనా రూల్స్ బేఖాతరు చేశారు జనం. ఆలయంలో జలాభిషేకం చేసేందుకు వందలాదిగా తరలివచ్చారు. దీంతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ 23మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.
గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్ మహోగ్రరూపంతో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఆస్పత్రులన్నీ కోవిడ్ బాధితులతో కిక్కిరిసిపోయాయి. అయితే ,ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితి అదుపులోకి వస్తుందనుకున్న సమయంలో మూఢనమ్మకాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..వందలాదిగా పోటెత్తారు. ఆలయానికి జలాభిషేకం చేస్తే కరోనా అంతమవుతుందన్న మూఢనమ్మకంతో గుంపులు గుంపులుగా తరలివచ్చారు. ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు.
అహ్మదాబాద్ శివార్లలోని సనంద్ తాలూకా నవపురాలో కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేశారు. వందలాది మంది మహిళలు తలపై నీటి బిందెలతో బైల్యదేవ్ ఆలయానికి తరలివచ్చారు. పూనకాలతో ఊగిపోయారు. ఆ నీటి బిందెలను ఆలయ శిఖరంపైకి చేర్చి అభిషేకం చేశారు. బైల్యదేవ్ ఆలయంలో జలాభిషేకం చేస్తే కరోనా వైరస్ అంతరించిపోతుందని వారి నమ్మకం. దీంతో కరోనాను నిర్మూలించాలంటూ వందలాది మంది ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్ రూల్స్‌ను బేఖాతరు చేశారు. ఊహించని విధంగా ఒక్కసారిగా ఆలయానికి వందలాదిమంది తరలిరావడంతో ఏం చేయాల్లో పోలీసులకు అర్ధం కాలేదు. చివరికి ఈ వీడియో వైరలవడంతో చర్యలకు దిగారు.
ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్ సహా నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో నీటి బిందెలతో తరలివచ్చారని..ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 23 మందిని అరెస్ట్ చేసి.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనాతో నవపురా గ్రామంలో ఇప్పటివరకు 90మంది మృతి చెందారు. మరోవైపు కరోనా విజృంభణతో గుజరాత్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. నైట్ కర్ఫ్యూతోపాటు ఆంక్షలు అమలులో ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఈ ఆంక్షలను మే 12వరకు పొడిగించింది ప్రభుత్వం. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ వంటి ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మూసివేశారు.
Read Also… ఈ బ్యాంకు మూసేస్తారా.. కొనసాగుతుందా..? ఉద్యోగులు, కస్టమర్ల పరిస్థితి ఏంటి..! తెలుసుకోండి..