ఈ బ్యాంకు మూసేస్తారా.. కొనసాగుతుందా..? ఉద్యోగులు, కస్టమర్ల పరిస్థితి ఏంటి..! తెలుసుకోండి..

IDBI Bank : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్, సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ) సమావేశంలో ఈ రోజు

ఈ బ్యాంకు మూసేస్తారా.. కొనసాగుతుందా..? ఉద్యోగులు, కస్టమర్ల పరిస్థితి ఏంటి..! తెలుసుకోండి..
Bank Image
Follow us

|

Updated on: May 05, 2021 | 8:20 PM

IDBI Bank : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్, సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ) సమావేశంలో ఈ రోజు ఐడీబీఐ బ్యాంకులో మొత్తం వాటాను అమ్మడంపై నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభం నుంచి బయటపడటానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి), ప్రభుత్వం ఈక్విటీ క్యాపిటల్‌గా రూ.9,300 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఎల్ఐసికి ఈ బ్యాంక్ పై కమాండ్ ఉంటుంది.

ఐడీబీఐ బ్యాంక్ ఐదేళ్ల తర్వాత లాభదాయకంగా మారింది. 2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 1,359 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ఏడాది క్రితం 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుకు రూ.12,887 కోట్ల నష్టం జరిగింది. 31 మార్చి 2021 నాటికి బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ 22.37 శాతానికి మెరుగుపడింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 27.53 శాతం నమోదైంది. నికర ఎన్‌పిఎ ఏడాది క్రితం 4.19 శాతానికి 1.97 శాతానికి మెరుగుపడింది. ప్రభుత్వం బ్యాంకులో ఉన్న తన మొత్తం వాటాను విక్రయించబోతుందని సమాచారం. బ్యాంకులో ప్రభుత్వ వాటాను విక్రయించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రభుత్వంతో పాటు, ఎల్‌ఐసీ కూడా తన వాటాను అమ్మవచ్చు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను విక్రయించాలని నిర్మల సీతారామన్ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ తరువాత మార్చి 10 న రిజర్వ్ బ్యాంక్ ఐడీబీఐని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిసిఎ) ఫ్రేమ్‌వర్క్ నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాను విక్రయించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.5 శాతం వాటా ఉంది. అయితే ఎల్‌ఐసీ స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరించారు.

ఇది ఉద్యోగులు, కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. ఉద్యోగుల ఉద్యోగాలు మునుపటిలాగే కొనసాగుతాయి. అలాగే వినియోగదారులందరికీ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐడీబీఐ ప్రభుత్వ బ్యాంకు. ఇది 1964 లో దేశంలో ఏర్పడింది. 21000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎల్‌ఐసీ ఐడీబీఐలో 51% వాటాను కొనుగోలు చేసింది. ఈ తర్వాత ఎల్‌ఐసీ, ప్రభుత్వం కలిసి 9300 కోట్ల రూపాయలను ఐడీబీఐ బ్యాంకుకు ఇచ్చాయి.

Viral Video : లేడీస్ మందు పార్టీ..! ఖరీదైన మందు సుక్క.. మంచింగ్‌కు మటన్ ముక్క..? వైరల్ అవుతున్న వీడియో..

కోవిడ్ 19 తో ఎన్ ఎస్ జీ సీనియర్ కమెండో బి.కె. ఝా మృతి, విషాదంలో కౌంటర్ టెర్రరిస్ట్ కమెండో ఫోర్స్