AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : లేడీస్ మందు పార్టీ..! ఖరీదైన మందు సుక్క.. మంచింగ్‌కు మటన్ ముక్క..? వైరల్ అవుతున్న వీడియో..

Womens Drink Party : మద్యం వ్యసనం చాలా చెడ్డ అలవాటు. ఎంతోమంది జీవితాలను అది నాశనం చేసింది. అయితే ఈ రోజుల్లో మద్యపానం

Viral Video : లేడీస్ మందు పార్టీ..! ఖరీదైన మందు సుక్క.. మంచింగ్‌కు మటన్ ముక్క..? వైరల్ అవుతున్న వీడియో..
Women Drinking
uppula Raju
|

Updated on: May 05, 2021 | 7:45 PM

Share

Womens Drink Party : మద్యం వ్యసనం చాలా చెడ్డ అలవాటు. ఎంతోమంది జీవితాలను అది నాశనం చేసింది. అయితే ఈ రోజుల్లో మద్యపానం అందరికి అలవాటుగా మారుతోంది. మద్యం సేవించడం గౌరవంగా ప్రజలు భావిస్తున్నారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది మహిళలు పెద్ద మొత్తంలో మద్యం సేవించడం కనిపిస్తుంది. ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ నేరుగా రికార్డ్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియోలో సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది మహిళలు ఒక టేబుల్ ముందు వృత్తాకారంలో కూర్చుంటారు. టేబుల్‌పై ఖరీదైన మందుబాటిల్ కనిపిస్తుంది. ఓ గాజు గ్లాసులో మద్యం నింపి ఉంటుంది. అలాగే టేబుల్‌పై వివిధ రుచికరమైనవి ఐటమ్స్ కనిపిస్తాయి. అందులో మాంసం ముక్కలు కూడా ఉంటాయి. మహిళలు ఈ ఆహారం తింటుండటం వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు మద్యం తాగుతున్నారని అర్థమవుతోంది.

ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపీన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అంతేకాకుండా ఫన్నీ క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. దీంతో అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. మీరు బయటకు వెళ్లి కరోనాకు బలవ్వడం కంటే ఇంట్లో ఇలాంటి పార్టీలు చేసుకోవచ్చు కదా అంటూ క్యాప్షన్ రాశాడు. శర్మ షేర్ చేసిన వీడియోను చాలామంది చూశారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలామంది లైక్, షేర్ చేస్తున్నారు.

కోవిడ్ 19 తో ఎన్ ఎస్ జీ సీనియర్ కమెండో బి.కె. ఝా మృతి, విషాదంలో కౌంటర్ టెర్రరిస్ట్ కమెండో ఫోర్స్

Mayor: కొలిక్కి వచ్చిన కార్పొరేషన్ మేయర్ల ఎంపిక.. వరంగల్‌లో గుండు సుధారాణి, ఖమ్మంలో పునుకొల్లు నీరజ..?