కోవిడ్ 19 తో ఎన్ ఎస్ జీ సీనియర్ కమెండో బి.కె. ఝా మృతి, విషాదంలో కౌంటర్ టెర్రరిస్ట్ కమెండో ఫోర్స్

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)లో పని చేస్తున్న సీనియర్ కమెండో బి.కె.ఝా కోవిడ్-19 తో మరణించారు. గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆసుపత్రిలో ఆయన బుధవారం మృతి చెందారు.

కోవిడ్ 19 తో ఎన్ ఎస్ జీ సీనియర్ కమెండో బి.కె. ఝా మృతి, విషాదంలో కౌంటర్ టెర్రరిస్ట్ కమెండో ఫోర్స్
Nsg Commando Died Of Covid 19
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 05, 2021 | 7:43 PM

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)లో పని చేస్తున్న సీనియర్ కమెండో బి.కె.ఝా కోవిడ్-19 తో మరణించారు. గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆసుపత్రిలో ఆయన బుధవారం మృతి చెందారు. దేశంలోని అత్యున్నత కౌంటర్ టెర్రరిస్ట్ కమెండో ఫోర్స్ లో కోవిడ్ సంబంధ తొలి మృతి కేసు ఇది. 54 ఏళ్ళ ఈ గ్రూప్ కమాండర్ (కో-ఆర్డినేషన్) గత నెల 19 న కోవిడ్ పాజిటివ్ కి గురయ్యారు. ఆయన పరిస్థితి క్రమంగా విషమించడంతో ఈ హాస్పిటల్ కి తరలించారు. కొద్దిగా కోలుకుంటున్నట్టు కనిపించినా ఆ తరువాత ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎన్ ఎస్ జీ వర్గాలు తెలిపాయి.ఆయనను వెంటిలేటర్ పై ఉంచాలని తాము కోరినా దురదృష్టవశాత్తూ ఈ ఆసుపత్రిలోని రెండు వెంటిలేటర్లూ పని చేయడంలేదని తెలిసిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్ కి ఫోన్ చేయగా ఇంత తక్కువ సమయంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసినట్టు వెల్లడించాయి. నోయిడా లోని ప్రముఖ ఫోర్టిస్ ఆసుపత్రి ని కాంటాక్ట్ చేయగా వెంటిలేటర్ ఉందని అన్నారని, కానీ స్పెషల్ అంబులెన్స్ లేదని చెప్పారని తెలిసింది. లైఫ్ సేవింగ్ అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా చివరకు ఎన్ ఎస్ జీ కే చెందిన వాహనంలో ఈ హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. అయితే అప్పటికే చాలా సమయం మించిపోవడంతో ఝా గుండెపోటుతో మృతి చెందారు. సకాలంలో ఆయనకు వెంటిలేటర్ సౌకర్యం, అలాగే అంబులెన్స్ ఏర్పాటు ఉండి ఉంటే, అదే సమయంలో చికిత్స త్వరగా జరిగి ఉంటే ఆయనకు ప్రాణాపాయం తప్పేదని, బతికేవారని ఎన్ ఎస్ జీ సిబ్బంది కంట తడిపెడుతున్నారు. దేశంలో అత్యున్నత కమెండో సంస్థలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారికే ఈ విధమైన పరిస్థితి తలెత్తడం దారుణమని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Mayor: కొలిక్కి వచ్చిన కార్పొరేషన్ మేయర్ల ఎంపిక.. వరంగల్‌లో గుండు సుధారాణి, ఖమ్మంలో పునుకొల్లు నీరజ..?

CORONA THIRD-WAVE: దేశంలో కరోనా విజృంభణ.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిఫుణులు.. ఏదీ దారి?