AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA THIRD-WAVE: దేశంలో కరోనా విజృంభణ.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిఫుణులు.. ఏదీ దారి?

దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.

CORONA THIRD-WAVE: దేశంలో కరోనా విజృంభణ.. థర్డ్ వేవ్ తప్పదంటున్న నిఫుణులు.. ఏదీ దారి?
Corona Third Wave
Rajesh Sharma
|

Updated on: May 05, 2021 | 7:25 PM

Share

CORONA THIRD-WAVE INEVITABLE IN INDIA: దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి (CORONA VIRUS) తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు (CORONA POSITIVE CASES) ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ (VACCINATION) కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 3 లక్షల 82 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 3 వేల 780 మందికి పైగా మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2 కోట్ల 6లక్షల 65 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాలు 2 లక్షల 26 వేల 188కి చేరుకున్నాయి. 3 లక్షల 38 వేల 439 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 69 లక్షల 51 వేలకు పైగా కోలుకున్నారు. ఇక యాక్టివ్‌ కేసులు 34 లక్షల 87 వేల 229 ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (CORONA CASES) తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు మహారాష్ట్ర (MAHARASHTRA)లో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ (LOCK DOWN) విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ (NIGHT CURFEW) విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు (TAMILNADU), పంజాబ్‌ (PUNJAB), మధ్యప్రదేశ్‌ (MADHYA PRADESH), కేరళ (KERALA) తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు (CORONA CASES) తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.

దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (UNION HEALTH MINISTRY) ఆందోళన వ్యక్తం చేసింది. 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్‌ కేసులు (CORONA ACTIVE CASES) ఉన్నాయన్నారు. మహారాష్ట్ర లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని… బెంగళూరు (BENGALURU), చెన్నై (CHENNAI) నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలో 1.49 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఈ సంఖ్య 38వేలుగా ఉందని తెలిపింది. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION) వెల్లడించింది. ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌ (BHARAT)లోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) వెల్లడించింది. ఆసియా (ASIA)లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మొత్తం కొవిడ్‌ (COVID-19) మరణాల్లో 25శాతం భారత్‌లోనే ఉంటున్నాయి అని ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికలలో వెల్లడించింది. ఇక ఇప్పటివరకు అత్యధిక కొవిడ్‌ మరణాలు అమెరికా (AMERICA)లో చోటుచేసుకోగా… బ్రెజిల్‌ (BRAZIL) రెండో స్థానంలో ఉంది. భారత్‌లో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 4 లక్షలకు చేరడం, నిత్యం మూడున్నర వేల మంది మృత్యువాతపడుతున్నారు.

కేర‌ళ‌ (KERALA)లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తున్న‌ది. రికార్డుస్థాయిలో 41 వేల 953 క‌రోనా కేసులు, 58 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20 ల‌క్ష‌లు దాట‌గా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5 వేల 565 కు చేరింది. మ‌రోవైపు క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో కేర‌ళ సీఎం (KERALA CM) పిన‌ర‌యి విజ‌య‌న్ (VIJAYAN) ప్ర‌ధాని మోదీ (PRIME MINISTER NARENDRA MODI)కి లేఖ రాశారు. వెయ్యి ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌, 50 ల‌క్ష‌ల డోసుల కోవిషీల్డ్‌ (COVIE SHIELD), 25 ల‌క్ష‌ల కోవాగ్జిన్ (COVAXINE) డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేయాలని కోరారు. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆక్సిజ‌న్‌ (OXYGEN) ప్లాంట్లు, వెంటిలేట‌ర్స్‌ను అంద‌జేయాల‌ని అభ్య‌ర్థించారు. కరోనా సెకండ్ వేవ్ (CORONA SECOND WAVE) విజృంభణతో కర్ణాటక ప్రభుత్వం (KARNATAKA GOVERNMENT) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌  (TOTAL LOCK DOWN)దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్‌డౌన్‌ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం.

కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరగడంతో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 12 నాటికి పరిస్థితులను సమీక్షించి కేసులు ఇలాగే కొనసాగితే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని యడియూరప్ప ప్రభుత్వం (YADIYURAPPA GOVERNMENT) యోచిస్తోంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కోరలు చాస్తోంది. రాజధాని బెంగళూరు నగరంలో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 40 వేల 128 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 22 వేల 112 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 55 శాతంగా నమోదైంది. గత వారం బెంగళూరులో పాజిటివిటీ రేటు 12 శాతంగా ఉండగా అది ఒక్క వారంలోనే 55 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 3 లక్షలకుపైగానే యాక్టిక్‌ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 44వేల631 కరోనా కేసులు నమోదవగా 288 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కర్నాటక సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని… అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. కర్నాటకలో లాక్‌డౌన్ పెట్టాలా? వద్దా? అనేది ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయంపై ఆధారపడి ఉందని, ఆయన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేసులకు అడ్డుకట్ట పడడం లేదని… దీంతో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని యోచిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు.

ప‌శ్చిమ బెంగాల్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మమతా బెనర్జీ పలు అంశాలపై అధికారులుతో చర్చించారు. బెంగాల్ లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో తాజాగా ప‌లు నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను ఆమె ప్ర‌క‌టించారు. రేపటి నుంచి లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డంతో పాటు మార్కెట్లు, షాపులు ఉద‌యం ఏడు నుంచి ప‌దిగంట‌ల వ‌ర‌కూ ఆపై సాయంత్రం ఐదు నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ప‌నిచేయాల‌ని పేర్కొన్నారు. కోల్ క‌తా మెట్రో స‌హా వాహ‌నాల్లో యాభై శాతం సీటింగ్ నే అనుమ‌తిస్తారు. తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. కొత్తగా 6వేల మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2వేల527 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల69వేల722కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3లక్షల89వేల491 మందికి పైగా కోలుకున్నారు. మృతుల సంఖ్య 2వేల527గా ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,225 మందికి క‌రోనా సోకింది.

తెలంగాణ‌ (LOCK DOWN)లో లాక్‌డౌన్‌ పక్కా అనే ఊహాగానాలకు ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ (CHIEF SECRETARY SOMESH KUMAR) స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. కరోనా కట్టడికి వీకెండ్‌ లాక్‌డైన్‌ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేద‌న్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని అంక్షలు విధించేందుకు హైకోర్టు (HIGH COURT) సూచ‌నల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని, ఆ మేర‌కు వీకెండ్ లాక్‌డౌన్ (WEEKEND LOCK DOWN) అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని సీఎస్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాలతో పోలిస్తే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ‌లో త‌క్కువ‌గా ఉంద్నారు. రాష్ట్రంలో మందులు, ఆక్సిజ‌న్‌తో పాటు నిత్యావ‌స‌రాల‌ కొర‌త లేదని… ఇంకా ఆక్సిజ‌న్ బెడ్స్ పెంచాల‌ని సీఎం ఆదేశించారన్నారు. అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. వీకెండ్ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెంజు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు సమర్పించాలని ఆర్డర్స్‌ వేసింది. ఇక తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ (ANDHRA PRADESH)లో కరోనా రోజురోజుకూ విలయం సృష్టిస్తున్నది. పాజిటివ్‌ కేసులు, మరణలు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 22 వేల పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో చికిత్స పొందుతూ 85 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12 లక్షల 3 వేల 337కు పెరిగాయి. ఇప్పటి వరకు 8 వేల 374 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్‌ కేసులు 2 లక్షలు దాటాయి. ఏపీలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాల పాటు ప్రతీరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. మే 5 నుంచి 18 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే, కర్ఫ్యూ నిబంధనల నుండి కొన్నింటికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఏపీలో కర్ఫ్యూ నుంచి బ్యాంకులు, జాతీయ రహదారి పనులకు, పోర్టులకు మినహయింపు ఇస్తూ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ALSO READ: ఏపీలో డేంజరస్ కరోనా వైరస్.. కొత్త రకం కరోనా వెరైటీతో సీమాంధ్రలో ప్రమాద ఘంటికలు

ALSO READ: ఎల్లుండి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం కానీ అప్పుడే స్టాలిన్ ఏం చేశాడంటే?

ALSO READ: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో