Kamal Hassan Review: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంపై సినీ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. పార్టీ ఓటమి చెందడంపై నేతలతో చర్చించారు. తమిళనాడులో మక్కల్‌ నీది మయ్యం కమల్‌ హాసన్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో...

Kamal Hassan Review: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో
Kamalhassan
Follow us
Rajesh Sharma

|

Updated on: May 05, 2021 | 5:35 PM

Kamal Hassan Review on Assembly Election defeat:  లోక నాయకుడు ఆత్మావలోకనంలో పడ్డారు. తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MAKKAL NEEDI MAYYAM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ (KAMAL HASSAN) పార్టీ నేతలతో సమీక్ష మొదలుపెట్టారు.  పార్టీ ఓటమి చెందడంపై నేతలతో చర్చించారు. తమిళనాడులో మక్కల్‌ నీది మయ్యం కమల్‌ హాసన్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల ముందే ఓట్ల కోసం డబ్బులు పంచబోనని కమల్ ముందే చెప్పారు. సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్ అన్న మాటను చేసి చూపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన కమల్.. ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు. కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ (MNM PARTY) అభ్యర్థులంతా ఓడిపోయారు. శరత్ కుమార్ (SHARATH KUMAR) పార్టీ సహా మరో రెండు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దానికితోడు తన కుమార్తె అక్షరా హాసన్ (AKSHARA HASSAN), అన్న కూతురు సుహాసిని (SUHASINI) లతో విరివిగా ప్రచారం, డాన్సులు వేయించినా తాను పోటీ చేసిన కోయంబత్తూరు సౌత్ (COIMBATORE SOUTH) స్థానాన్ని కూడా కమల్ హాసన్ దక్కించుకోలేకపోయారు.

మక్కల్‌ నీది మయ్యం కమల్‌ హాసన్‌ పార్టీ దాదాపు 150 స్థానాల్లో పోటీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ (BJP) అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ (VANATI SRINIVASAN)పై 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ అధ్వర్యంలో మూడో కూటమి ఏర్పడింది. మక్కల్ నీది మయ్యం, ఇండియా జన నాయక కట్చి, సమత్తువ మక్కల్‌ కట్చి పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఎంఎన్‌ఎం 154, ఎస్‌ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే తమిళ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

అదేవిధంగా ఆ పార్టీ పోటీ చేసిన మిగిలిన స్థానాల్లో కూడా ఎంఎన్‌ఎం అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఎన్నికల ఓటమికి గల కారణాలను ఆరా తీశారు. అదేసమయంలో పార్టీ నేతలకు కూడా కమల్‌హాసన్‌ ధైర్యం చెప్పారు. ఓటమితో కుంగిపోవద్దని, నిరంతరం ప్రజల మధ్యవుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా, ఎన్నికల ఓటమిపై మరోమారు రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించేలా ఇందులో నిర్ణయించినట్టు సమాచారం.

ఎన్నికల్లో విజయభేరీ మోగించిన డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK STALIN)ను కమల్‌హాసన్‌ స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. స్థానిక ఆళ్వార్‌పేటలోని స్టాలిన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుక్షణమే స్టాలిన్‌ను అభినందిస్తూ కమల్‌ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం విశేషం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 157 స్థానాలను కైవసం చేసుకుంది.

ALSO READ: ఎల్లుండి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం కానీ అప్పుడే స్టాలిన్ ఏం చేశాడంటే?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.