Udhayanidhi Stalin: ఈ యంగ్ హీరో అటు పొలిటికల్ గానూ.. ఇటు హీరోగానూ రాణిస్తాడా..
మన స్టార్ హీరోలకు సీఎం కుర్చీ కాదు... కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్స్ ఇవ్వాలన్న ధ్యాస కూడా ఉన్నట్టు లేదు మనోళ్లకు.
Udhayanidhi Stalin :
మన స్టార్ హీరోలకు సీఎం కుర్చీ కాదు… కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే ఛాన్స్ ఇవ్వాలన్న ధ్యాస కూడా ఉన్నట్టు లేదు మనోళ్లకు. రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్ ని లోతుగా చూసి ఉస్సూరుమంటోంది సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంట్రీని మిస్సయిన ఏపీ అసెంబ్లీలాగే… రేపటిరోజున తమిళనాడు అసెంబ్లీ కూడా… ఆ స్టార్ డమ్ లేక.. కళ తప్పి బోసిపోనుంది. గతమెంతో ఘనకీర్తి అంటూ ఎన్టీయార్, ఎంజీఆర్, జయలలిత కటౌట్లను స్మరించుకోవడమే మిగలబోతోందా? ముఖ్యమంత్రి కుర్చీనిచ్చి గుండెల్లో పెట్టి పూజించుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు ఆలోచనాతీరును మార్చుకున్నారా అనే సందేహాలు పుట్టేస్తున్నాయి. అభిమానులు వేరు-ఓటర్లు వేరు అనే ఈక్వేషన్ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతోంది. రీసెంట్ ఎలక్షన్స్ కూడా సినిమా స్టార్లకు వెన్ను చూపిందన్నది అనలిస్టుల అంచనా.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎన్నికలకు ముందే జెండా ఎత్తేశారు. ఆయన కనుక పార్టీ పెట్టి రంగంలోకి దిగి ఉంటే.. కథ మరోలా ఉండేదేమో. ఇప్పటికయితే.. తమిళనాడు పాలిటిక్స్ లో సినిమా స్టార్ల సక్సెస్ సోసోగానే వుంది. లోక నాయకుడన్న పేరు సినిమాలకే పరిమితమా అనేలా వుంది కమల్ పొలిటికల్ ఫ్యూచర్. పార్టీ మేటర్ అటుంచితే తాను పోటీ చేసిన సెగ్మెంట్ లోనే ఓటమిపాలై నిరాశపరిచారు కమల్. మొన్నటి అసెంబ్లీలో కనీసం ఎమ్మెల్యేగా కనిపించిన విజయ్ కాంత్ ఈసారి.. ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యారు. శరత్ కుమార్ ఉనికి కూడా గల్లంతయింది. హీరోయిన్ గా వున్నప్పుడు అభిమానులతో గుడి కట్టించుకునేంత క్రేజ్ తెచ్చుకున్న ఖుష్బూ.. డైరెక్ట్ ఎలక్షన్స్ లో మాత్రం గెలవలేకపోయారు. యువరాజు ఉదయనిధి ఒక్కరే వెండితెర తరపున మెరుస్తున్నారు. సో.. కమల్ అండ్ రజనీ.. ఇద్దరూ ఇక ఫుల్ టైం సినీ అభిమానుల కోసమే స్పెండ్ చేస్తారేమో!
మరిన్ని ఇక్కడ చదవండి :