AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ఎల్లోరా శిల్పంలా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా..

సినిమా ఇండస్ట్రీలో నటవారసుల హావ బాగానే నడుస్తుంది. ఇప్పటికే చాలామంది వారసులు సినిమాల్లో రాణిస్తున్నారు.  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకెళ్తుంది.

Janhvi Kapoor: ఎల్లోరా శిల్పంలా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ... జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా..
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా గడుపుతుంది. 
Rajeev Rayala
|

Updated on: May 04, 2021 | 1:32 PM

Share

సినిమా ఇండస్ట్రీలో నటవారసుల హావ బాగానే నడుస్తుంది. ఇప్పటికే చాలామంది వారసులు సినిమాల్లో రాణిస్తున్నారు.  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా  ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. జాన్వి తన రాబోయే చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ను ఇటీవల ముగించింది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ అమ్మడు ఇటీవల వెకేషన్ కోసం మాల్ దీవులు వెళ్ళింది. అక్కడి నేచర్ ను ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జాన్వీ కపూర్ హాట్ హాట్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. అక్కడ సముద్ర తీరాన్ని, అలల సవ్వడిని ఆస్వాదిస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  ఈ పిక్స్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ బ్యూటిఫుల్‌, ఏంజెల్‌, లవ్‌లీ.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మ్యాగజైన్ కవర్ ఫోటోపై జాన్వీ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ కపూర్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dasari Narayana Rao: దా’సరిలేరు మీకెవ్వరు..’ దర్శక రత్న దాసరి నారాయణ రావు..

Ravi Teja’s Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ ‘ఖిలాడి’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Happy Birthday Trisha Krishnan: అందం అభినయం కలబోసిన చెన్నై చంద్రం త్రిష