Dasari Narayana Rao: దా’సరిలేరు మీకెవ్వరు..’ దర్శక రత్న దాసరి నారాయణ రావు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఓ ధ్రువ తార.. ఎందరో దర్శకులకు ఆయన మార్గదర్శి. ఆయనే దర్శక రత్న.. దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు.

Dasari Narayana Rao: దా'సరిలేరు మీకెవ్వరు..'  దర్శక రత్న దాసరి నారాయణ రావు..
Dasari Narayana Rao
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2021 | 12:21 PM

Dasari Narayana Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన ఓ ధ్రువ తార.. ఎందరో దర్శకులకు ఆయన మార్గదర్శి. ఆయనే దర్శక రత్న.. దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు. దర్శకుడిగా నటుడిగా తెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు దాసరి. కమర్షియల్ సినిమాలనే కాదు విప్లవ జ్వాలను రగిలించే  సినిమాలు తీయడంలోనూ దాసరి దిట్ట. నేడు ఆ దర్శక శిఖరం జయంతి. దాసరి నారాయణ రావు భౌతికంగా మనమధ్య లేకపోయినా తెలుగు సినిమా ఉన్నంతవరకు ఆయన కీర్తి ఉంటుంది.  మే 4న 1947లో పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించిన దాసరి.. ‘విన్న పదం సినిమా.. కన్న కల సినిమా.. నడిచిన బాట సినిమా.. ఆడిన ఆట సినిమా..’

దాసరి చిన్న తనంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చదువుకు డబ్బులు లేక మానేసి పనికి కూడా వెళ్లారు. ఆ తర్వాత స్వతహాగా ఎదుగుతూ.. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. అనంతరం అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. తెలుగు , కన్నడ సినిమాల్లో నటుడిగాను గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. దాసరి సినిమాల్లో తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు వంటి సినిమాలు ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. నా అన్నవాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు. వందలాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న తుది శ్వాస విడిచారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ravi Teja’s Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ ‘ఖిలాడి’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా చూసి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. చిత్రయూనిట్ పై ఫిర్యాదు..

Keerthy Suresh: జాతీయ ఉత్త‌మ న‌టి కీర్తి సురేశ్ తొలి సంపాద‌న రూ. 500.. ఆ డ‌బ్బు ఎవ‌రికిచ్చారంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!