యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ సర్కారు వారి పాట… సినిమాలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండనుందట ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చివరగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నిల్ రావిపూడి దర్శకత్వంలో  సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ సర్కారు వారి పాట... సినిమాలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండనుందట ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2021 | 2:07 PM

sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చివరగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నిల్ రావిపూడి దర్శకత్వంలో  సరిలేరు నీకెవ్వరు సినిమా చేసాడు. ఈ సినిమా బ్లాక్స్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మహేష్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో మొదటిసారి కీర్తిసురేష్ మహేష్ తో జతకడుతుంది. ఈ సినిమా తమన్  సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఇప్పుడు కోవిడ్ కారణంగా ప్యాకప్ చెప్పారు అయితే ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట పరశురామ్.

బ్యాంకింగ్ రంగంలో జ్జారిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఎడారి బ్యాక్ డ్రాప్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే భారీ ఛేజింగ్ సీన్స్ కూడా షూట్ చేశారట. ఇక హీరోహీరోయిన్లపై వచ్చే కీలక సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. మధే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి లీక్ అయిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Happy Birthday Trisha Krishnan: అందం అభినయం కలబోసిన చెన్నై చంద్రం త్రిష

Ravi Teja’s Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ ‘ఖిలాడి’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Krithi Shetty: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పిన బేబమ్మ.. అదేంటంటే..