Krithi Shetty: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పిన బేబమ్మ.. అదేంటంటే..

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఈ బెంగుళూరు బ్యూటీ కుర్రాళ్ళ మనసు దోచేసింది.

Krithi Shetty: అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పిన బేబమ్మ.. అదేంటంటే..
కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2021 | 8:55 AM

Krithi Shetty :  ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఈ బెంగుళూరు బ్యూటీ కుర్రాళ్ళ మనసు దోచేసింది. బేబమ్మ అందానికి అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతోనే పరిచయం అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సుకుమార్ ప్రియా శిష్యుడు బిచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు ఉప్పెనలా ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే నాని నటిస్తున్న శ్యామ్ సింగారాయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కృతి. అలాగే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ అమ్మడు అవకాశం దక్కించుకుంది.  మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న సినిమాలో కూడా ఈ అమ్మడు ఎంపిక అయ్యింది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది బేబమ్మ . ‘మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..?’ అని ఓ ఫ్యాన్ అడగగా …’నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. చూడాలి మరి’ అంటూ చెప్పుకొచ్చింది కృతి. మరి రాబోయే సినిమాల్లో కృతి ముద్దుముద్దు తెలుగుమాటలు మాట్లాడుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘ఇందువదన’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో.. నయా లుక్కులో వరుణ్ సందేశ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..

Akhanda: బాబాయ్ సినిమాలో అబ్బాయ్‌..? అఖండ‌లో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్న నంద‌మూరి వార‌సుడు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!