Adipurush Movie: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ చిత్రాన్ని టీ సిరీస్

Adipurush Movie: 'ఆదిపురుష్' నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..
Adipurush Sudeep
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2021 | 2:43 PM

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.  తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కన్నడ హీరో సుదీప్ ఈ మూవీలో ఓ పాజిటివ్ రోల్‏లో నటిస్తున్నట్లుగా సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్, సుదీప్ మరోసారి ఒకే స్క్రీన్ పై కనిపిస్తారన్నమాట. ఈ సినిమాను త్రిడీ టెక్నాలజీతో.. హాలీవుడ్ రేంజ్ లో ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‏తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతీ సనన్ సీత గా కనిపిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపిస్తుండగా.. అతడి తమ్ముడు విభీషణుడి పాత్రకు మరో సౌత్ స్టార్ ను తీసుకున్నారట.

విభీషణుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ను ఫైనలైజ్ చేసిందట. మూవీ యూనిట్. ఇప్పటికే ప్రభాస్ తో బాహుబలి మూవీ చేసిన సుదీప్.. మరోసారి కలిసి నటించబోతున్నారన్నమాట. ఈగ, సన్నాఫ్ సత్యనారాయణ వంటి సినిమాలతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్.. ఎక్కువగా నెగటీవ్ రోల్స్ లోనే కనిపించాడు. ఆదిపురుష్ లో.. విభీషణుడి పాత్ర కీలకం అని చెబుతున్నారు. దీంతో ఆ పాత్రలో పేరున్న నటుడినే ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో.. సుదీప్ ను అనుకున్నారట. విభీషణుడు అంటే రాముడికి విధేయుడుగా ఉంటాడు. మరి ఈ పాజిటివ్ రోల్ లో సుదీప్ నటన ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

Also Read: డైరెక్ట్‏గా తెలుగులో సినిమా చేయనున్న విజయ్.. ఆ స్టార్ డైరెక్టర్‏తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న తలపతి..

మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?