డైరెక్ట్‏గా తెలుగులో సినిమా చేయనున్న విజయ్.. ఆ స్టార్ డైరెక్టర్‏తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న తలపతి..

Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు విజయ్ తన సినిమాలన్ని తెలుగులో

  • Rajitha Chanti
  • Publish Date - 7:54 pm, Mon, 3 May 21
డైరెక్ట్‏గా తెలుగులో సినిమా చేయనున్న విజయ్.. ఆ స్టార్ డైరెక్టర్‏తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న తలపతి..
Vijay Thalapathy

Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు విజయ్ తన సినిమాలన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవారు. ఇక ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ సాధించాయి. అయితే ఇప్పటివరకు విజయ్ సినిమాలన్ని తెలుగులో డబ్బింగ్ అయినవే. విజయ్ తెలుగులో నేరుగా ఒక్కసినిమా కూడా చేయలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ తలపతి నేరుగా తెలుగులో సినిమా చేయనున్నాడట.

ఇటీవల విజయ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ కు ప్రత్యర్థిగా మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాను నెల్సన్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. తాజాగా తలపతి విజయ్ తెలుగులో కూడా డైరెక్ట్ గా సినిమా చేయబోతున్నాడట. అది కూడా స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వంశీ.. విజయ్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించారని.. కథ నచ్చిన విజయ్ సానుకూలంగా స్పంధించినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాకు విజయ్ పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వివరాలను అఫీషియల్ గా ప్రకటించనున్నారట మేకర్స్. అన్ని కుదిరితే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ సినిమాని దాదాపు ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ప్లాన్ చేస్తున్నారట.

Also Read: పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?

నా ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‏లోనే ఉన్నాను.. స్వల్ప లక్షణాలున్నాయి.. అల్లు అర్జున్ ట్వీట్..

Ileana: ప్రెగ్నెంట్.. అబార్షన్.. ఆత్మహత్యాయత్నం.. అసలు మ్యాటర్ చెప్పిన ఇలియానా..