నా ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‏లోనే ఉన్నాను.. స్వల్ప లక్షణాలున్నాయి.. అల్లు అర్జున్ ట్వీట్..

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా చేస్తున్నాడు.

  • Rajitha Chanti
  • Publish Date - 6:30 pm, Mon, 3 May 21
నా ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‏లోనే ఉన్నాను.. స్వల్ప లక్షణాలున్నాయి.. అల్లు అర్జున్ ట్వీట్..
Allu Arjun

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక దేశంలో కరోనా విజృంభిస్తున్న కానీ.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని.. పుష్ప టీం మొత్తం నిర్విరామంగా షూటింగ్ చేశారు. ఇక అదే క్రమంలో బన్నీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

తాజాగా అల్లు అర్జున్ తన ఆరోగ్యం గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. ‘అందరికీ హలో.. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది.. కరోనా నుంచి కోలుకుంటున్నాను.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల బన్నీ తన ఫ్యామిలీతో సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బన్నీకి కరోనా తగ్గిపోయిందనుకున్నారు అంతా. అల్లు అర్హ, స్నేహ, అయాన్‌ల వీడియో షేర్ చేయడంతో బన్నీ ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని అంతా భావించారు. దీంతో బన్నీ ఆరోగ్యం కూడా ఆరా తీయడం ప్రారంభించారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన ఆరోగ్య పరిస్థితిని ఇలా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Also Read: Salaar Movie: ‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..

Shruti Haasan: త‌న లైఫ్ లో అద్భుతమైన ఫేజ్ ఇదే అంటున్న శ్రుతి హాసన్.. బాయ్‌ ఫ్రెండ్ గురించి ఏం చెప్పిందంటే

ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్న హీరో కార్తి… త్వరలో రానున్న క్లారిటీ