AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..

Salaar Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్.. దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు.

Salaar Movie: 'సలార్' సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..
Prabhas Srinidhi Shetty
Rajitha Chanti
|

Updated on: May 03, 2021 | 3:03 PM

Share

Salaar Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్.. దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‏తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతోపాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రెబల్ స్టార్ రాముడిగా కనిపించనున్నాడు. ఇక వీటితోపాటే.. పాన్ ఇండియా డైరెక్టర్.. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కరోనా నేపథ్యంలో కాస్తా బ్రెక్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం యాక్షన్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’, నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్‏గా చేసినా శ్రీనిధి శెట్టికి మంచి క్రేజ్ ఉంది. తానూ రాసుకున్న కథలో వచ్చే స్పెషల్ సాంగ్‏లో శ్రీనిధి పర్ఫెక్ట్‏గా సరిపోతుందని ప్రశాంత్ ఆమెను తీసుకున్నాడట.పైగా శ్రీనిధి శెట్టిని హీరోయిన్‏ను చేసింది కూడా ఈయనే. కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read:  అదిరిపోయే ఆప్షన్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకుందామా..

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?