అదిరిపోయే ఆప్షన్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకుందామా..
Money Saving Ideas: ప్రస్తుత కాలంలో డబ్బు సంపాందించాలని చూస్తున్నారా ? నెలవారీ సాలరీ రాగానే అనవసర ఖర్చులు చేసేస్తున్నారా ?
Money Saving Ideas: ప్రస్తుత కాలంలో డబ్బు సంపాందించాలని చూస్తున్నారా ? నెలవారీ సాలరీ రాగానే అనవసర ఖర్చులు చేసేస్తున్నారా ? దీర్ఘకాలంలో మీ పిల్లల కోసం లేదంటే ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు డబ్బులను ఆదా చేయాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అదెంటో తెలుసుకుందామా.
డబ్బులు ఆదా చేయాలనుకునేవారు నెలవారి జీతంలో సగం డబ్బులను ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే మీ భవిష్యత్తులో అధిక మొత్తం డబ్బులు ఆదా చేయడానికి మ్యుచువల్ ఫండ్స్ సరైన మార్గం. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వె్స్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ మీరు బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎఫ్ డీ, , పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే 7 నుంచి 8 శాతం వరకు రాబడి పొందవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడితే 12 నుంచి 15 శాతం వరకు రాబడి సొంతం చేసుకోవచ్చు. అందుకే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడితే అధిక రాబడి వస్తుంది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ప్రతి నెలా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్ లభిస్తుంది. ప్రతి నెలా తక్కువ మొత్తంతోనే భారీ లాభాన్ని అందుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు నెలకు రూ.1000 మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే 20 ఏళ్ళ తర్వాత మీకు రూ.20 లక్షలు లభిస్తాయి. ఇక్కడ 12 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం. అదే నెలకు రూ.500 పెడితే 20 ఏళ్ళలో రూ.5 లక్షలు వస్తాయి. అదే నెలకు రూ.500 ను 30 ఏళ్లకు పెడితే రూ.17.5 లక్షలు వస్తాయి. టెన్యూర్ పెరిగే కొద్ది మీకు వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. అదే మీరు రూ.50 లక్షలు పొందాలని భావిస్తే.. నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అంటే రోజుకు రూ.50 ఆదా చేయాలి. కానీ ఇలా 30 సంవత్సరాలు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.
Also Read: PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..
Gold Price Today: మరోసారి శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఇలా ఉన్నాయి..