మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? రూ.10 వేలతో రూ.5 లక్షలు.. అదిరిపోయే స్కీమ్..
Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. పలు రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో డబ్బులు.
Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. పలు రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టవచ్చు. అయితే అన్ని ఫండ్స్ ఒకే రకమైన రాబడి మాత్రం అందించలేవు. అందువల్ల డబ్బులు పెట్టే సమయంలో మంచి ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోవడం బెటర్. వీటిల్లో మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఇందులో మల్టీక్యాప్ గ్రోత్ స్కీమ్ ఇన్వెస్టర్లకు మూడేళ్ల కాలంలోనే 27.2 శాతం రాబడి అందించింది. మీరు ఈ ఫండ్‌లో నెలకు రూ.500 నుంచి డబ్బులు పెట్టవచ్చు. అంటే సిప్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి నెలా మీరు డబ్బులు పెట్టవచ్చు. తక్కువ మొత్తంలోనే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. సిప్ చేయడం వల్ల దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే మార్కెట్ రిస్క్ కూడా తగ్గుతుంది. అందుకే ఒకేసారి కాకుండా సిప్ రూపంలో డబ్బులు పెడితే ప్రయోజనం ఉంటుంది.
మహీంద్రా మనులైఫ్ మల్టీక్యాప్ గ్రోత్ ప్లాన్‌లో మీరు మూడేళ్ల పాటు నెలకు రూ.10 వేలు సిప్ చేస్తూ వచ్చారని అనుకుంటే.. ఇప్పుడు మీ చేతికి రూ.5.33 లక్షలు వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల విలువ రూ.3.6 లక్షలు అవుతుంది. అంటే మీకు దాదాపు రూ.2 లక్షల రాబడి వస్తాయి.