SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ, ఇతర పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. అయితే ఇటీవల కేవైసీ సమర్పించడానికి మే 31వ తేదీగా స్టేట్‌ బ్యాంక్‌.

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు
State Bank Of India
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2021 | 6:56 AM

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ, ఇతర పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. అయితే ఇటీవల కేవైసీ సమర్పించడానికి మే 31వ తేదీగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ప్రకటించింది. ఒక వేళ 31లోపు సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటనను ఎస్‌బీఐ ఉపసంహరించుకుంది. కేవైసీలను సమర్పించడానికి బ్రాంచ్‌లకు రావొద్దని సూచించింది. కరోనా నేపథ్యంలో వాటిని సమర్పించేందుకు బ్రాంచ్‌లకు రాకుండా ఎలా చేయాలో తెలియజేసింది.

అంతేకాదు వారిపై ఒత్తిడి కూడా చేయవద్దని కూడా అన్ని శాఖలకు సూచించింది. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు పోస్టు లేదా రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీ ద్వారా అవసరమైన పత్రాలు పంపవచ్చని సూచించింది. సాధారణంగా ప్రతి ఒక్కరు కేవైసీ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారుల ఇబ్బందులను బట్టి కేవైసీ అప్‌డేట్‌ చేసుకునేందుకు రెండు లేదా, ఎనిమిదేళ్ల సమయం ఇస్తుంటుంది. ఆ సమయంలోగా కేవైసీ చేసుకోవాల్సి చెబుతుంటుంది ఎస్‌బీఐ. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి కేవైసీ ఇవ్వని పరిస్థితి ఉండటంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన విభాగాలకు ఆదేశించింది. కొంత కాలం కిందట ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన ట్వీట్‌ తర్వాత ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గమనించాలని సూచించారు.

ఇవీ కూాడా చదవండి:

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!

Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?