May1, 2021 New Rules: అలర్ట్.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి
May1, 2021 New Rules: ఏప్రిల్ నెల ముగిసింది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు గ్యాస్ సిలిండర్..
May1, 2021 New Rules: ఏప్రిల్ నెల ముగిసింది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు గ్యాస్ సిలిండర్ నుంచి ప్రారంభిస్తే బ్యాంకింగ్, వ్యాక్సినేషన్ తదితర అంశాలను ప్రభావితం చేయనున్నాయి.
వ్యాక్సినేషన్ :
ఇక దేశంలో మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ రేపటి నుంచి వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందు కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ :
గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.861 ఉంది. అయితే ప్రతీనెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే మే 1న గ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశం ఉంది. మరి రేపటి నుంచి గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను పెంచి కస్టమర్లకు షాకిస్తాయా..? లేక తగ్గిస్తాయా అనే విషయం రేపు తేలనుంది.
యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు మే 1 నుంచి షాక్ ఇవ్వనుంది. మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్‌ను పెంచుతూ ఇటీవల బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను కూడా పెంచింది. ఉచిత నగదును విత్‌డ్రా చేసుకుంటే కస్టమర్లకు అధిక ఛార్జీలను విధించనుంది. ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్:
ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజ్‌ను రెట్టింపు చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. మే 1 నుంచి రూ.10 లక్షల వరకు కవరేజ్ లభించనుంది.
బ్యాంకులకు సెలవులు:
ఇంకా బ్యాంకులకు సైతం ఈ మే నెలలో భారీగా సెలవులు రానున్నాయి. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అయితే బ్యాంకు ఖాతాదారులను బ్యాంకు సెలవులను గమనించి పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది.