Gold Price: బంగారానికి కరోనావైరస్ షాక్.. తొలి క్వార్టర్ బాగున్నా.. ప్రస్తుత త్రైమాసికంలో కష్టకాలమే
బంగారానికి కరోనా వైరస్ షాక్ కొడుతోంది. 2021 తొలి మూడు నెలల్లో పలు సానుకూల పరిణామాల మధ్య బంగారం రేటు పెరుగుతూ వచ్చింది కానీ ఏప్రిల్ నాటికి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్...
Gold Price fluctuations during second wave: బంగారానికి కరోనా వైరస్ (CORONA VIRUS) షాక్ కొడుతోంది. 2021 తొలి మూడు నెలల్లో పలు సానుకూల పరిణామాల మధ్య బంగారం రేటు (GOLD PRICE) పెరుగుతూ వచ్చింది కానీ ఏప్రిల్ (APRIL) నాటికి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ (CORONA VIRUS SECOND WAVE) చుట్టుముట్టడంతో దేశం మరోసారి ఆంక్షల చట్రంలోకి వెళ్ళింది. దానికి తోడు ఏ క్షణమైన లాక్ డౌన్ (LOCK DOWN) విధించవచ్చన్న ఊహాగానాలు గోల్డు మార్కెట్ (GOLD MARKET) జోరుకు బ్రేక్ వేశాయి. ఫలితంగా 2021 జనవరి నుంచి మార్చి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం (GOLD), వెండి (SILVER) ధరలో ఏప్రిల్ నెలలో ఫ్లక్చుయేషన్‌కు గురవుతున్నాయి. ముఖ్యంగా బంగారం రేటు (GOLD RATE) మాత్రం ప్రతి రోజు హెచ్చుతగ్గులకు గురవుతోంది. మనదేశంలో బంగారం డిమాండ్ 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 37 శాతం పెరిగింది. ఈ పెంపు 2020లో ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరుగుదల కనిపించింది. పరిమాణంలో ఇది 140 టన్నులు. కోవిడ్ రిలేటెడ్ ఆంక్షలు (COVID-19 RESTRICTIONS) పూర్తిగా తొలగిపోవడం, అంతర్జాతీయంగా ధరలు దిగిరావడం వంటి అంశాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు, కొనుగోళ్ళలో పెరుగుదలకు ప్రధాన కారణం. 2020 మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 102 టన్నులు కాగా 2021 జనవరి-మార్చి మధ్య కాలంలో ఇది 140 టన్నులు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఏప్రిల్ 29వ తేదీన ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి.
విలువ రూపంలో చూస్తే బంగారం డిమాండ్ (GOLD DEMAND) 57 శాతం పెరిగింది. రూ.37,580 కోట్ల నుంచి రూ. 58,800 కోట్లకు చేరుకుంది. ఆభరణాల డిమాండ్ 39 శాతం పెరిగింది. పరిమాణంలో ఇది 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులకు ఎగబాకింది. విలువలో చూస్తే, 58 శాతం పెరిగి రూ.27,230 కోట్ల నుంచి రూ.43,100 కోట్లకు చేరుకున్నది. పెట్టుబడుల డిమాండ్ 34 శాతం పెరిగింది. పరిమాణంలో 28.1 టన్నుల నుంచి 37.5 టన్నులకు పెరిగింది. విలువలో 53 శాతం ఎగసి రూ.10,350 కోట్ల నుంచి రూ.15,780 కోట్లకు ఎగసింది. ఇక గోల్డ్ రీసైక్లింగ్ 20 శాతం పడిపోయింది. పరిమాణంలో 18.5 టన్నుల నుంచి 14.8 టన్నులకు చేరింది. మొదటి త్రైమాసికంలో నికర దిగుమతులు భారీగా 262 శాతం పెరిగి 83.1 టన్నుల నుంచి 301 టన్నులకు చేరాయి. బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్ భారీగా 34 శాతం పెరిగింది. 2015 తర్వాత ఈ స్థాయి పటిష్ట డిమాండ్ ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా 23 శాతం పతనమయ్యాయి.
కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మార్చి త్రైమాసికంలో 23% పడిపోయింది. 2020 ఇదే కాలంతో పోల్చిచూస్తే పరిమాణం 1,059.9 టన్నుల నుంచి 815.7 టన్నులకు దిగింది. పసిడి ఈటీఎఫ్ నుంచి నిధులు బయటకు వెళ్లడం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు అంతంతమాత్రంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. పెట్టుబడుల డిమాండ్ 71 శాతం పడిపోయి, 549.6 టన్నుల నుంచి 161.6 టన్నులకు దిగింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 124.1 టన్నుల నుంచి 95 టన్నులకు తగ్గింది. కాగా ఆర్‌బీఐ కొనుగోళ్లు 18 టన్నుల నుంచి 18.7 టన్నులకు ఎగశాయి.
2021లో తొలి మూడు నెలలు బంగారం మార్కెట్ల బాగున్నా.. ఏప్రిల్ నెల నుంచి బంగారం మార్కెట్లు క్రమంగా కుదేలవుతున్నాయి. గోల్డు రేట్లు తరచూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ధర తగ్గడం, కోవిడ్ ఆంక్షల సడలింపుతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం మార్చి త్రైమాసికంలో పసిడి సెంటిమెంట్‌ను సానుకూలమైంది. వార్షికంగా చూస్తే, త్రైమాసికంలో సగటున 10 గ్రాముల పసిడి ధర 14 శాతం పెరిగి రూ.47,131గా ఉంది. అయితే సమీక్షా కాలానికి ముందు త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ధర 6 శాతం తగ్గింది. ధర గరిష్ట స్థాయిల్లో రూ.56,000 వద్ద ఉన్న ఆగస్టు 2020తో పోలి్చతే ధరల్లో తగ్గుదల ఏకంగా 16 శాతంగా ఉంది. రూ.50,000 దిగువకు పసిడి దిగిరావడంతో కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు సంసిద్ధత సానుకూలంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల వంటి కార్యక్రమాలు డిమాండ్‌కు తోడయ్యాయి.
ఇక పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్ మెరుగుపడ్డం ఇది వరుసగా మూడవ త్రైమాసికం. పసిడిపై సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేతం కావడం పసిడికి సానుకూల అంశాలుగా మారాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇంత మంచి ఫలితాలు ఉంటాయన్న విషయం అనుమానమే. కోవిడ్-19 సెకండ్‌వేవ్ పెరుగుదల, రాష్ట్రాల్లో స్థానికంగా లాక్‌డౌన్లు, వినియోగ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా అంశాల నేపథ్యంలో పెళ్లిళ్లకు బంగారం డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతం అయ్యేంత వరకూ డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగే వీలుంది. ఆయా పరిస్థితుల్లో 2021 సంవత్సరం మొత్తంగా డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశం చెప్పడం కష్టమే.
ALSO READ: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం
ALSO READ: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!
ALSO READ: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?