AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America U-Turn: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో భారత్, అమెరికా సంబంధాల్లో రెండు, మూడురోజుల్లో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. సెకెండ్ వేవ్‌లో వచ్చిన కరోనా వైరస్ మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో..

America U-Turn: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!
America U Torn
Rajesh Sharma
| Edited By: Ravi Kiran|

Updated on: May 01, 2021 | 7:33 AM

Share

America U-Turn in India matter: కరోనా వైరస్ (CORONA VIRUS)ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో భారత్ (BHARAT), అమెరికా (AMERICA) సంబంధాల్లో రెండు, మూడు రోజుల్లో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. సెకెండ్ వేవ్‌లో వచ్చిన కరోనా వైరస్ మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో చిన్నా, చితకా కలిపి మొత్తం 45 దేశాలు మనకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, రష్యా (RUSSIA) ప్రచ్ఛన్న యుద్దం కాలం తర్వాత మెల్లిగా మన దేశానికి దగ్గరైన అమెరికా మాత్రం సడన్‌గా అమెరికన్లే తమకు ముఖ్యమంటూ కరోనా వ్యాక్సిన్ (CORONA VACCINE) తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను మన దేశానికి సరఫరా చేసేందుకు విముఖత వ్యక్తం చేసింది. దాంతో మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో జనం షాకయ్యారు. అత్యంత మిత్ర దేశంగా భారత్‌ను ప్రకటించిన అమెరికా అత్యంత కీలకమైన సమయంలో భారత్‌కు చేయూతనందించేందుకు వెనుకంజ వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అన్ని సందర్భాలలో అంటే కష్టంలోను, సుఖంలోను మన వెంట నడిచే వాడే అసలైన మిత్రుడు అంటారు. అలాంటి ఇండియా (INDIA) అత్యంత దారుణమైన పరిస్థితికి చేరుకుంటుంటే అమెరికా సాయమందించాల్సింది పోయి.. అమెరికన్ల ప్రాణాలే తమకు ముఖ్యమంటూ ముఖం చాటేయడం ఓ రకంగా చెప్పాలంటే భారత్‌కు షాకే అని చెప్పాలి. అయితే ముడి పదార్థాలు సరఫరా చేయబోమని ప్రకటించిన 24 గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ యూ టర్న్ (U-TURN) తీసుకున్నారు. భారత్‌ను ఆదుకునేందుకు ఏదైనా చేస్తామని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా.. ఏకంగా అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఈలోగానే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ సోషల్ మీడియా (SOCIAL MEDIA)లో పోస్టులు వెల్లువెత్తాయి.

ఇంగ్లిష్‌లో ‘ఆల్‌ వెదర్‌ ఫ్రెండ్స్‌’ (ALL WHETHER FRIENDS) అనే మాట వుంది. అన్ని సమయాల్లోనూ మనతో నిలబడే స్నేహితుల గురించి చెప్పినమాట అది. మిత్ర దేశమైన మనల్ని ఈ కరోనా కష్టకాలంలో అమెరికా దూరం పెట్టిందంటూ బైడన్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగపడే ముడి పదార్థాలను మనకు ఇవ్వడానికి ఆ దేశం నిరాకరించడం అందుకు కారణం. అప్పటినుంచీ ఆ దేశంపై మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలే వచ్చాయి. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ (DONALD TRUMP) గెలిచి పోవాలని బలంగా కోరుకున్నవారు పనిలో పనిగా ‘ట్రంపే వుంటేనా…’ అంటూ పోస్టులు, ట్వీట్లు చేశారు. కొందరైతే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఉదారవాదులపై ‘మరి ఇప్పుడేమంటారు..? ’ అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొందరు అమెరికా వైస్ ప్రెసిడెంట్ (AMERICAN VICE PRESIDENT) కమలా హ్యారిస్‌ (KAMALA HARRIS) తన మూలాలు మరిచి స్వదేశానికి ద్రోహం చేస్తోందంటూ ఎత్తిపొడిచారు. భారత్‌ పేరు చెప్పి డెమొక్రాటిక్‌ పార్టీకి దండిగా ఓట్లు రాబట్టి ఇప్పుడు మౌనంగా వుండి పోయారని విమర్శించారు.

అయితే రెండు ప్రభుత్వాల మధ్య సాగిన దౌత్య ఫలితమో, భారత ప్రజల్లో తమపై వ్యతిరేకత అలుముకుందన్న అభిప్రాయమో… మొత్తానికి అమెరికా తన వైఖరిని మార్చుకుంది. మన దేశం కోరినట్టు వ్యాక్సిన్‌ ముడిపదార్ధాల సరఫరాకు అమెరికా సమ్మతించింది. అంతేకాదు… ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు కూడా అందిస్తామని ప్రకటంచింది. కష్టకాలంలో అమెరికాకు సాయపడినందుకు మీకూ అదేవిధంగా సాయం చేయదల్చుకు న్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (AMERICAN PRESIDENT JOE BIDEN) ప్రధాని నరేంద్ర మోదీ (NARENDRA MODI)కి స్వయంగా ఫోన్ చేసి చెప్పారని మీడియా కథనాలున్నాయి. మొత్తానికి వారం, 10 రోజులుగా ఈ విషయంలో వినబడిన చిటపటలు సర్దుకున్నాయి. సాధారణంగా దౌత్యపరమైన అంశాలను ప్రజానీకం పట్టించుకోరు. ఇందుకు తమిళనాడు (TAMIL), బెంగాల్‌ (BENGAL) కొంత మినహాయింపు అనే చెప్పాలి. శ్రీలంక (SRI LANKA)లో తమిళులపై లేదా వారి తరఫున పోరాడిన తమిళ టైగర్‌ సంస్థపై అక్కడి ప్రభుత్వం నిర్బంధాన్ని అమలు చేసినప్పుడల్లా తమిళనాడులో ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ఆ దేశంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వచ్చేది.

అలాగే తీస్తా నదీజలాలపై బంగ్లాదేశ్‌ (BANGLADESH) తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ బెంగాల్‌లో ప్రజాగ్రహం పెల్లుబుకడం కనిపించేది. ఇటీవలకాలంలో అన్ని దేశాల్లోనూ జాతీయవాదం (NATIONALISM) బాగా పెరిగి దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తున్నది. ట్రంప్‌ అధ్యక్షుడిగా వున్నప్పుడు వీటి ప్రభావంతోనే ఆయన నిర్ణ యాలు తీసుకునే ప్రయత్నం చేసేవారు, మాట్లాడేవారు. తన మద్దతుదార్లను సంతృప్తిపరచడానికి వున్నట్టుండి చైనా (CHINA)పై విరుచుకుపడేవారు. కానీ అధ్యక్షుడిగా అక్కడి బహుళజాతి సంస్థల ప్రయో జనాలను కాపాడటం కోసం భిన్న సందర్భాల్లో ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మళ్లీ కొన్నాళ్లకు అవసరం పడిందనిపిస్తే చైనాపై విమర్శలు చేసేవారు. ఎంతో సన్నిహితంగా వున్నామని మనల్నేమీ వదల్లేదు. ముఖ్యంగా ఖరీదైన ద్విచక్ర వాహనం హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై మన దేశం విధించిన సుంకాలను రద్దు చేయించడానికి ఆయన సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయో గించారు. ఒకటికి పదిసార్లు చర్చలు జరిపారు. వినలేదని అలిగారు. ఆఖరికి ఒక సమావేశంలో మోదీని ఆ బైక్‌పై సుంకాలు ఎత్తివేయమని అడిగినప్పుడల్లా ఆయన జవాబిచ్చే తీరును అనుకరిస్తూ అవహేళన చేసేందుకు ప్రయత్నించారు. వినలేదని చివరకు మన ఉత్పత్తులపై అక్కడ భారీ సుంకాలు విధించారు. ప్రతిగా మన దేశం కూడా అమెరికా వస్తువులపై సుంకాల శాతం పెంచింది.

దౌత్య సంబంధాలెప్పుడూ సరళరేఖ మాదిరి వుండవు. దేశాధినేతల రాజకీయ దృక్పథాలు, దేశ ప్రజానీకం మనోభావాలు ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటాయి. ఆమేరకు హెచ్చుతగ్గులుం టాయి. అదే సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడటం, వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడటం పాలకులకు ముఖ్యం గనుక వాటిని సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాక్సిన్‌ ముడిపదార్థాల ఎగుమతిపై ఆంక్షల విషయంలో బైడెన్‌ ప్రభుత్వానికి తన కారణాలు తనకు వుండొచ్చు. మన దేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు, సాయం చేయడానికి రష్యా, చైనా, బ్రిటన్‌ వంటివి ముందుకు రావడం చూశాక వెనక్కు తగ్గివుంటుంది. వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు. ఒకరి బాధను మన బాధగా పరిగణించి ఆదుకోవడానికి ముందుకు ఉరకటం తప్పదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విషయంలో సమస్య మనది కాదు కదా అనుకునే పరిస్థితి లేదు. వ్యాపార వ్యవహారాల కోసం దేశాల మధ్య నిత్యం రాకపోకలు తప్పనిసరైనప్పుడు వేరే దేశం గురించి మనకెందుకని ఉపేక్షించే వీలుండదు. ఆ మాటెలావున్నా ముడిపదార్థాల ఎగుమతులను అనుమతించబోమన్న నిర్ణయంపై వ్యక్తమైన ఆగ్రహావేశాలు సాధారణ స్థాయిలో లేవు.

అయితే దీనితో అయిపోలేదు. కరోనా వ్యాక్సిన్ల పేటెంట్లను సడలించే అంశాన్ని పరిశీలించాలి. మన దేశమే కాదు.. ఏ దేశమైనా దాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుని, తన పౌరులకందించే వీలుం డాలి. అది జరిగినప్పుడే విశ్వవ్యాప్తంగా అందరికీ ఈ మహమ్మారినుంచి విముక్తి లభిస్తుంది. ఇంత మాత్రం చేత మనం ఇతరేతర అంశాల్లో అమెరికా చేసే ప్రతిపాదనలను అంగీకరించాల్సిన పనిలేదు. ఆ దేశంతో వున్న స్నేహసంబంధాలను పెంపొందించుకుంటూనే మన ప్రయోజనాలే గీటు రాయిగా ఏ నిర్ణయాన్నయినా తీసుకోవాలి. చైనాతో, రష్యాతో తనకుండే సంబంధాలనుబట్టి మనల్ని ఆ దిశగా ప్రభావితం చేయడానికి అమెరికా ప్రయత్నించినప్పుడల్లా స్వీయ ప్రయోజనాలే మన నిర్ణయాలకు గీటురాయి కావాలి.

ALSO READ: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?