Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Age: స్విమ్మింగ్ పూల్ కోసం భూమి తవ్వితే బయటపడిన ఎముకలు..షాక్ తిన్న యజమాని..పోలీసులు ఏమన్నారంటే..

పురాతన శిలాజాలు ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉంటాయి. సాధారణంగా పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇలాని పురాతనమైన అవశేషాలు దొరుకుతుంటాయి.

Ice Age: స్విమ్మింగ్ పూల్ కోసం భూమి తవ్వితే బయటపడిన ఎముకలు..షాక్ తిన్న యజమాని..పోలీసులు ఏమన్నారంటే..
Ice Age Bones
Follow us
KVD Varma

|

Updated on: Apr 30, 2021 | 4:11 PM

Ice Age: పురాతన శిలాజాలు ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉంటాయి. సాధారణంగా పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇలాంటి  పురాతనమైన అవశేషాలు దొరుకుతుంటాయి. అవి ఒక్కోసారి కొన్ని వందల సంవత్సరాల పూర్వ సమయానికి సంబంధించినవి కావచ్చు. అలాగే వీటిలో విలువైన లోహాలు.. లోహపు పాత్రలు..చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఆనవాళ్లు.. ఇంకా మనుషులు, పక్షులు, జంతువులకు సంబంధించిన శిలాజాల అవశేషాలు కావచ్చు. ఇవి ఎక్కువగా పరిశోధకులు తమ పరిశోధనల్లో సంపాదిస్తుంటారు. చాలా అరుదుగా మాత్రమే జన సాంద్రత ఉన్న పట్టణాల్లో నగరాల్లో పురాతన అవశేషాలు దొరుకుతూ ఉంటాయి.

లాస్ వెగాస్ కి చెందిన మాట్ పెర్కిన్స్, ఆమె భర్త వాషింగ్టన్ లో ఉండేవారు. అక్కడ నుంచి ఈమధ్య కాలంలోనే నెవాడాలో కొత్తగా నిర్మించిన ఇంటికి మారారు. అక్కడ వారు తమ ఇంటిలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని భావించారు. అందుకోసం పూల్ బిల్డర్లను సంప్రదించారు. వారు వచ్చి పూల్ కోసం అవసరమైన గోతిని తవ్వడం మొదలు పెట్టారు. వారు భూమీ నుంచి 5 అడుగుల లోతు తవ్వగానే ఎముకల గూడు బయటపడింది. వెంటనే, పని ఆపుచేసి మాట్ పెర్కిన్స్ కి సమాచారం అందించారు. దీంతో ఆమె అక్కడి ఎముకలను చూసి.. ఇక్కడ ఏదైనా నేరం జరిగి ఉండవచ్చని భావించింది. ఆ ఆలోచనతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు వచ్చిన పోలీసులు ఆ స్థలంలో తమ పరిశోధనలు మొదలు పెట్టారు. ఆ ఎముకలను పరిశీలించారు. వాటిని శాస్త్రీయంగా పరిశీలించిన తరువాత అవి ఇప్పటివి కావని..చాలా పాత ఎముకలని తేల్చారు. ఈ ఎముకల విషయంలో చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవనీ, అక్కడ వారు తమ పని చేసుకోవచ్చనీ పోలీసులు తెలిపారు.

అయితే, ఈ విషయంపై నెవాడా సైన్స్ సెంటర్ రీసెర్చ్ డైరెక్టర్ జాషువా బోండే  అక్కడి మీడియాతో మాట్లాడుతూ, అక్కడ లభించిన ఎముకలు వేల సంవత్సరాల క్రితం జీవించిన జీవులవి అని చెప్పారు. కానీ, అవి మనుష్యుల ఎముకలు కాదనీ, గుర్రం లేదా అంతకంటే పెద్ద క్షీరడానికి చెందినవి అని స్పష్టం చేశారు. ఈ ఎముకలు కనీసం 6000 సంవత్సరాల నుంచి 14,000 సంవత్సరాల కాలానికి చెందినవి అయివుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకా పరిశోధనలు చేస్తేనే కానీ వాటి గురించి పూర్తి సమాచారం తెలీదని చెప్పారు.

Also Read: America U-Turn: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!

Gold Seized: విమానాశ్రయంలో 2.8 కేజీల బంగారం పట్టివేత.. అనుమానంతో పరిశీలించగా..