Gold Seized: విమానాశ్రయంలో 2.8 కేజీల బంగారం పట్టివేత.. అనుమానంతో పరిశీలించగా..

Gold seized at RGI Airport: దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. విదేశాల

Gold Seized: విమానాశ్రయంలో 2.8 కేజీల బంగారం పట్టివేత.. అనుమానంతో పరిశీలించగా..
Gold Seized At Rgi Airport
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2021 | 10:33 AM

Gold seized at RGI Airport: దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారు అక్రమంగా.. బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం పాస్తా తయారీ గ్రైండర్‌ మాటున పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఈకే-526 విమానంలో స్వదేశానికి వస్తున్నాడు. ఈ క్రమంలో 2.8కిలోల బంగారాన్ని కరిగించి పాస్తా గ్రైండర్‌ ఆకారంలో తయారు చేసి లోపలి భాగంలో బిగించి తీసుకువస్తున్నాడు.

ఈ క్రమంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగి బయటకు వస్తున్న క్రమంలో.. ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతను తీసుకువచ్చిన సామగ్రిని పరిశీలించగా అక్రమ బంగారం పట్టుబడింది. ఈ 2.8కిలోల బంగారం విలువ 1.36 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Also Read:

అమెరికా నుంచి అందిన తొలి ‘కోవిడ్ సాయం’, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన యూఎస్ విమానాలు

K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే