K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

KV Anand passes away: దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ (54) క‌న్నుమూశారు. ఆసుపత్రిలో

K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
Director And Cinematographer K.v. Anand
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2021 | 9:04 AM

KV Anand passes away: దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ (54) క‌న్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్ర‌వారం తెల్లవారుజామున మూడు గంట‌ల‌కు గుండె పోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. అనతికాలంలోనే సూపర్ డూపర్ సినిమాలు చేసి అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ కేవీ ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించి.. పలు సినిమాలకు ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ఆయన మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఈ మేరకు పలువురు ప్రముఖులు, నటులు కేవీ ఆనంద్ మృతికి సంతాపం తెలియజేశారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కేవీ ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ను క‌లిసి ఆయ‌న శిష్యుడిగా మారారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా నిలదొక్కుకున్నారు.

కేవీ. ఆనంద్ సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. సూర్య‌తో వీడొక్క‌డే (అయాన్‌) తో హిట్ కొట్టి దర్శకుడిగా తన మార్క్‌ను చూపించారు. ఆనంద్ జీవాతో తెర‌కెక్కించిన రంగం (కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత బ్ర‌ద‌ర్స్‌ (మాట్రాన్‌), అనేకుడు (అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌ (కాప్పాన్‌) చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

దీంతోపాటు తెలుగులో కూడా హిట్ చిత్రాలను అందించారు. ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేవీ ఆనంద్.. మోహ‌న్ లాల్, సూర్య‌, ధ‌నుష్‌, విజయ్ సేతుప‌తి, రవితేజ వంటి స్టార్స్‌తో క‌లిసి ప‌ని చేశారు.

Also Read:

Anil Ravipudi: బాలయ్య బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

Rakul Preet Singh: బాలీవుడ్ లో బిజీగా మారిన బ్యూటీ… వరుస అవకాశాలను అందుకుంటున్న అందాల రకుల్