Anil Ravipudi: బాలయ్య బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. టాలీవుడ్  వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు.

Anil Ravipudi: బాలయ్య బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 30, 2021 | 7:26 AM

Anil Ravipudi:

నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. టాలీవుడ్  వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ‘ఎఫ్2’ ముందు వరకూ అనిల్ రావిపూడి కేవ‌లం మీడియం రేంజ్ ఉన్న హీరోలతో మాత్రమే ప‌నిచేశాడు. స్టార్ ఇమేజ్ హీరోలను మ్యానేజ్ చెయ్యగలడా అనే డౌట్ అందరికీ వచ్చిన క్రమంలో మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ తీసి ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. నిజానికి చాలా రోజుల క్రిత‌మే బాలయ్య‌-అనిల్ రావిపూడి కాంబోలో ఎప్పుడో మూవీ ఫైన‌ల‌య్యింది. కానీ ఇద్ద‌రికీ డేట్స్ అడ్జ‌స్ట్ అవ్వ‌డం లేదు. దీనికి త్వ‌ర‌లోనే ముహుర్తం కుద‌ర‌బోతుంద‌ని అనిల్ ధీమాగా చెప్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే అనిల్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అనిల్.. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెలలో మైసూర్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం.

తాజాగా అనిల్ బాలయ్య సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం 75 కోట్లు బడ్జెట్ ని కేటాయించనున్నారట.  షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు బాలయ్య  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!