Aha OTT: మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వందకుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..
Aha OTT: ఓటీటీ రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది ‘ఆహా’. వంద శాతం తొలి తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ అనతి కాలంలోనే...
Aha OTT: ఓటీటీ రంగంలో ఓ పెను సంచలనంగా దూసుకొచ్చింది ‘ఆహా’. వంద శాతం తొలి తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ అనతి కాలంలోనే ప్రేక్షకుల మనసులను చూరగొంది. ఓటీటీ రంగంలో తొలిసారి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రకరకాల టాక్ షోలతో దూసుకెళ్లింది ‘ఆహా’. ఈ క్రమంలోనే తెలుగు కంటెంట్ అందిస్తోన్న ఏకైక యాప్‌గా అందరితో ‘ఆహా’ అని పించుకుంటోందీ ఓటీటీ. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ‘ఆహా’ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ‘ఆహా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా పది మిలియన్లకు అంటే.. కోటికి చేరుకోవడం విశేషం. వందకు పైగా దేశాల్లో ‘ఆహా’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ‘ఆహా’ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తమ తాజా ఘనతను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. ‘మాది ప్రస్తుతం 10 మిలియన్ల సబ్‌స్కైబర్లతో కూడిన కుటుంబం. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నిజంగా మీరు కోటి మందిలో ఒకరు’. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
‘ఆహా’ యాజమాన్యం చేసిన ట్వీట్..
We are now a family of 10 million ?? Thank you for all the love! You’re all truly one in a million ?
Here’s to more 100% Telugu entertainment! pic.twitter.com/yypUXkdvND
— ahavideoIN (@ahavideoIN) April 28, 2021
ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ‘క్రాక్’, ‘గాలి సంపత్’, ‘నాంది’, ‘లెవన్త్ అవర్’, ‘మెయిల్’, ‘తెల్లవారితే గురువారం’, ‘చావు కబురు చల్లగా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ఆహా’ తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ‘ఆహా’ మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Corona Crisis: మానసిక బలం.. కరోనా కాలంలో ప్రజలకు ముఖ్య అవసరం అంటున్న ఆరోగ్య నిపుణులు
61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి ‘వాలిమై’ డైరెక్టర్‌తోనే అజిత్..