AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి ‘వాలిమై’ డైరెక్టర్‏తోనే అజిత్..

Ajith Next Movie Update: తమిళ స్టార్ హీరో అజిత్.. ఎవరినైనా నమ్మితే తలపై పెట్టుకుంటాడు. అలాంటి విశ్వాసంతోనే

61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి 'వాలిమై' డైరెక్టర్‏తోనే అజిత్..
Ajith
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2021 | 3:09 PM

Share

Ajith Next Movie Update: తమిళ స్టార్ హీరో అజిత్.. ఎవరినైనా నమ్మితే తలపై పెట్టుకుంటాడు. అలాంటి విశ్వాసంతోనే డైరెక్టర్ శివతో వరుసగా నాలుగు సినిమాలు చేశాడు. ఇప్పుడు తన ‘వాలిమై’ మూవీ డైరెక్టర్ వినోద్‏కు ముచ్చటగా మూడో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 50 యేళ్లకు చేరువవుతున్నా.. వరుస సినిమాలతో ఫ్యాన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. అజిత్. కథ నచ్చితే చాలు.. జెట్ స్పీడ్ తో చిత్రాలు చేస్తుంటాడు. అలాంటి అజిత్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు మరిన్ని ఆఫర్లు ఇస్తుంటాడు కూడా. డైరెక్టర్ శివతో ఏకంగా నాలుగు సినిమాలు చేసిన అజిత్.. ప్రస్తుతం వినోద్ తో మూడో మూవీకి కమిట్ అయ్యాడు.

అజిత్ తన అప్‌కమింగ్ మూవీ వాలిమై డైరెక్టర్ వినోద్‌తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో నీర్కెండ పార్త్వే అనే మూవీ వచ్చింది. ఇది హిందీ పింక్ మూవీకి రీమేక్. ఇది బాగా ఆడటంతో.. నెక్ట్స్ వీరిద్దరి కాంబినేషన్‌లో వాలిమై వస్తోంది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉండగానే.. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను అజిత్ బర్త్ డే సందర్భంగా.. మే ఫస్ట్ కు రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. అయితే ఇదిలా ఉండగానే.. వినోద్ తో మరో మూవీ చేయాలని అజిత్ నిర్ణయించాడు. గతంలో శివతో మొదట వీరం మూవీ చేశాడు. అది సూపర్ హిట్ కావడంతో.. రెండోసారి వేదాళం, మూడోచిత్రంగా వివేగం తీశారు. ఆ తర్వాత విశ్వాసం మూవీ చేశారు. ఇవన్నీ తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు అదే ఫార్ములాతో వాలిమై డైరెక్టర్ వినోద్ తో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు అజిత్.

ట్వీట్..

Also Read:  దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..