దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

Anushka Shetty: టాలీవుడ్ బ్యూటీ.. అనుష్క షెట్టి పెళ్లి పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..
Anushka Shetty
Rajitha Chanti

|

Apr 29, 2021 | 2:15 PM

Anushka Shetty: టాలీవుడ్ బ్యూటీ.. అనుష్క షెట్టి పెళ్లి పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన స్వీటీ.. త్వరలోనే ఓ ఎన్నారైను పెళ్లాడనుందట. కరోనా ప్యాండమిక్ పోయాక.. మూడు ముళ్లు వేసుకోనుందట. అవునూ.. ఇంతకీ తాను ఏడడుగులు నడిచేది.. తనకంటే చిన్నవాడితోనేనట. దీంతో ఫిల్మ్ వర్గాల్లో దేవసేన గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. 40 ఏళ్లకు దగ్గర్లో ఉన్న టాలీవుడ్ స్వీటి.. పెళ్లి త్వరలోనే దుబాయ్ కు చెందిన బిజినెస్ మెన్‏ను పెళ్లి చేసుకోనుందట.

సూపర్ తో వెండితెరకు ఎంట్రి ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత అగ్ర హీరోలందరితోనూ స్టెప్పులేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక టాలీవుడ్ పరిశ్రమలో డార్లింగ్ ప్రభాస్, అనుష్క పర్‌ఫెక్ట్ జోడీ అని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని.. డేటింగ్ లో కూడా ఉన్నారని.. అప్పట్లో ఎన్నో రూమర్స్ సినీ వర్గాల్లో వినిపించాయి. అయితే అలాంటి వైరల్ న్యూస్ అంతా ఫేక్ అంటూ ప్రభాస్, అనుష్క కొట్టిపారేశారు. మేమిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే తేల్చిచెప్పారు. దీంతో స్వీటీ మ్యారేజ్ ఇప్పుడప్పుడే లేదని అనుకున్నారంతా. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తుండగా.. ఈ సమయంలో దేవసేన పెళ్లికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ కు చెందిన బడా బిజినెస్ మెన్ కుమారుడితో పెళ్లి జరుగుతుందని.. తెలుస్తోంది. ఇక అనుష్కను పెళ్లాడబోయేది.. భారత మూలాలున్న ఓ బిజినెస్ మెన్ అని.. అంతేకాకుండా.. సదరు వరుడు అనుష్క కంటే తక్కువ వయస్సున్నవాడని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక.. అసలు విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. బాహుబలి తర్వాత అనుష్క జాతిరత్నాలు ఫేమ్.. నవీన్ పొలిషెట్టితో ఓ మూవీ చేస్తున్నారని.. ఇటీవలే కథనాలొచ్చాయి. ఇందులో కూడా హీరోయిన్ తనకంటే చిన్నవాడితో ప్రేమయాణం సాగించే స్టోరీ అని టాక్ నడుస్తోంది.

Also Read: వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ వెండితెరకు దూరమై నేటికి ఏడాది… తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్న తనయుడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu