Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ వెండితెరకు దూరమై నేటికి ఏడాది… తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్న తనయుడు..
Irfan Khan death anniversary: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి నేటికి ఏడాది పూర్తి. గతేడాది
Irrfan Khan death anniversary: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి నేటికి ఏడాది పూర్తి. గతేడాది ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో 53 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చికిత్స పొందుతూ కన్నుముశారు. ఇటీవల ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దార్, అతని కుమారుడు బాబిల్.. ఫిల్మ్ కంపానియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్నాడు బాబిల్. ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చాము. చివరి రోజులలో తను నవ్వుతునే కనిపించాడు. నా వైపు చూస్తూ.. నవ్వుతూనే ఒక మాట చెప్పాడు. నేను చనిపోతున్నాను ఇక అని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు బాబిల్. కాదని వారిస్తున్న వినకుండా నవ్వుతునే ఉన్నాడని.. ఆ తర్వాత అలాగే నవ్వుతూ నిద్రలోకి వెళ్లాడని తెలిపారు.
ఇర్ఫాన్ ఖాన్.. ది నెమ్సేక్, పాన్ సింగ్ తోమర్, హైదర్, సలామ్ బాంబే వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్‌తో పాటు లైఫ్ ఆఫ్ పై వంటి అంతర్జాతీయ చిత్రాల్లో తన నటనతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.
బాబిల్ ట్వీట్స్..
View this post on Instagram
View this post on Instagram
ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?