AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Corona Symtoms: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో ప్రజలు మళ్లీ కరోనా నియమాలను పాటిస్తున్నారు.

ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?
Covid News
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2021 | 12:18 PM

Share

Corona Symtoms: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో ప్రజలు మళ్లీ కరోనా నియమాలను పాటిస్తున్నారు. కరోనా సృష్టిస్తున్న కరోనా కల్లోలం నుంచి తమను తాము రక్షించుకోవడానికి కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వయసుతో సంబంధం లేకుండా అందిరికి సోకుతుంది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, ఆకస్మాత్తుగా పడిపోవడం, తీవ్ర అలసటగా ఉంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. చాలా మంది కరోనా రోగులు పొడి దగ్గు, బలహీనత వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఇక ఈ సమస్యలను అధిగమించేందుకు ఆటలు ఆడడం, రోజూ వ్యాయం చేయడం వలన అలసట నుంచి కాస్త కోలుకోవచ్చు.

మీకు ఒకవేళ జ్వరం, ఒకరకమైన అలసట ఉండడంవలన వంటివి కూడా కరోనా లక్షణాలే అంటున్నారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే.. ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళడం మంచిది. అలాంటి సదుపాయాలు ఏం లేకుండా ఉంటే. వెంటనే సమీపంలోని కోవిడ్ సెంటర్ కు వెళ్లడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టీ-పిసిఆర్ టెస్టుల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

లక్షణాలు.. 1. జ్వరం తగ్గుతుంది. అలసట, బలహీనంగా ఉండటమే కాకుండా.. శరీర నొప్పులు, ఇతర సమస్యలు ఉంటాయి. 2. కరోనా లక్షణాలున్న వ్యక్తిని ప్రత్యేకమైన గదిలో ఉండనివ్వాలి. 3. కోవిడ్ సోకిన వ్యక్తి బోర్లా పడుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది ఉపిరితిత్తులపై కలిగే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. 4. పల్స్, రక్తపోటు, o2 స్థాయిలు కరెక్ట్ గా ఉన్నా కూడా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు.

హార్వర్డ్ నివేధిక ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తి నాడీ లక్షణాలు, జీర్ణశయాంతర లక్షణాలు ఉంటాయి. అలాగే వారిలో శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కరోనా కొంతమందిలో మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని హర్వర్డ్ నివేధికలో ప్రచురించబడింది. కోవిడ్ ఉన్నవారిలో కనిపించే నిర్దిష్ట న్యూరోలాజికల్ లక్షణాలు వాసన కోల్పోవడం, రుచి చూడలేకపోవడం, కండరాల బలహీనత, చేతులు మరియు కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి, మత్తుగా ఉండడం, గందరగోళం, మతిమరుపు, మూర్ఛలు, స్ట్రోక్. ప్లేట్‌లెట్ లెక్కింపు పడిపోవడం లేదా థ్రోంబోసైటోపెనియా అనే పరిస్థితి వల్ల కూడా బలహీనత ఉంటుంది.

Also Read: Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…